ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80సీట్లలో 71గెలుచుకుంది. మోదీ ప్రభంజనం ఉత్తరాదిని ఊపేస్తున్న సమయంలో సాధించిన ఈ గెలుపు ఈ వేసవిలో అంత తేలిక కాదు. 2014ఎన్నిక ల్లో గెలిచిన సీట్లలో నాలుగో వంతు యూపీ నుంచే బీజేపీకి దక్కాయి. యూపీలో బీజేపీయేతర ప్రధాన పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్‌ తదితర పార్టీల మధ్య అప్పుడెలాంటి పొత్తు లేదు. అప్నాదళ్‌ అనే చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఆ ఘన విజయం సాధించింది.
UP ABP News C Voter Survey కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు మాత్రం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దేశమెుత్తం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టిసారించింది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాల ను మాత్రం నిశితంగా గమనిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్పీ, -బీఎస్పీ పార్టీ పొత్తుల ప్రభావం బీజేపీపై ఎలా ఉంటుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీల పొత్తు ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉంది. ఇటీవలే ఏపీబీ న్యూస్ సీ ఓటర్స్ సంస్థ ఉత్తరప్రదేశ్ లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఆసక్తికర తీర్పును ఇస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
బీఎస్పీ సమాజ్ వాద్ పార్టీ పొత్తు ఉంటే మళ్లీ నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం కష్టమని తేల్చి చెప్పింది. ఒకవేళ పొత్తు అటూ ఇటూ అయితే ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది. ఏబీపీ న్యూస్-సీ ఓటర్స్ సర్వే ప్రకారం ఎస్పీ- బీఎస్పీల మధ్య పొత్తు వైఫల్యం  అయితే బిజేపి నాయకత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 291 ఎంపీ సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అదనంగా 19 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. 
UP ABP News C Voter Survey కోసం చిత్ర ఫలితం
ఒకవేళ ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఎన్డీఏ 247 సీట్లకే  పరిమితం అవుతుంది అని తెలిపింది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు మరో 25 స్థానాలు కావాల్సి ఉంటుంది అని చెప్పింది.  2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించిందని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటులో యూపీ ప్రభావం ఎంతో ఉందని తెలి పింది. 80 పార్లమెంట్ స్థానాలకు గానూ 71 స్థానాలను గెలుచుకుందని సీఓటర్స్ సర్వే స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగితే 50 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఎన్డీఏ 28 సీట్లు కోల్పో యి కేవలం 43 సీట్లకే పరిమితం కావాల్సి వస్తుందని తెలిపారు.  
uttara pradeash bjp vs sp-bsp కోసం చిత్ర ఫలితం
మాహాకూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికార ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో తేలికగా అధికారంలోకి రావచ్చని భావిస్తోంది. ఇకపోతే ఉ.ప్ర. లో కీలక నియోజకవర్గాల్లో బీజేపీ దెబ్బతింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గమైన ఘోరక్ పూర్, డిప్యూటీ సీఎం నియోజకవర్గ మైన ఫూల్ పుర్, కైరానా నియోజకవర్గాల్లో ఆర్ఎల్డీ విజయం సాధించడం కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
UP ABP News C Voter Survey కోసం చిత్ర ఫలితం
ఇకపోతే ఒడిస్సా ఎన్నికల్లో బీజేపీ 21 లోక్ సభ స్థానాలకు గానూ 15 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఏబిపి న్యూస్-సీ ఓటర్స్ సర్వే తెలిపింది. అటు యూపీఏ మాత్రం మహారాష్ట్ర, తమిళనాడు, ఏపి, కేరళ విజయం సాధించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: