కృష్ణ జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. రాజకీయ దిగ్గజం, కమ్యూనిస్ట్ నేత పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ గా గన్నవరనికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. మొదట కమ్యూనిస్టలకు, ఆ తరవాత కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత టీడీపీకి అండగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ తన ప్రత్యర్థి అయిన రామచంద్రరావు పై పదివేల ఓట్ల పైచీలతో గెలుపొంది అసెంబ్లీ లో అడుగుపెట్టారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం 1958 లో ఏర్పడింది.

ఇక్కడ మొత్తం మీద 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొదటిసారి ఎన్నికల్లో జరిగినప్పుడు కమ్యునిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య విజయం సాధించారు. ఆ తర్వాత సీతారామయ్య, రత్నబోసు, కాకాలి వెంకటరత్నం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎక్కువసార్లు విజయం సాధించింది. 1985 లో ఇక్కడ తొలిసారి విజయం సాధించిన టీడీపీ ఆ తర్వాత మరో మూడుసార్లు విజయం సాధించింది. టీడీపీ నుంచి దాసరి బలవర్దన్ రావు రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన్ని కాదని వంశీ కి టికెట్ ఇచ్చిన ఆయన కూడా విజయం సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టారు.

గన్నవరం నియోజకవర్గం లో రాజకీయ చైతన్యం ఎక్కువ. అంతకముందు కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది అయితే రానురాను టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యం మొదలైంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి ఎక్కువ మద్దతు ఉండడంతో టీడీపీదే విజయం అని భావిస్తున్నారు. కానీ మిగతా పార్టీలకు కూడా మద్దతు బాగానే ఉండడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగనుంది. ఇక్కడ టీడీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయడం ఖాయం అయిపొయింది. ఇక వైసీపీ నుంచి రామచంద్రరావు ను తప్పించి ఈసారి యార్లగడ్డ వెంకటరావు కు టికెట్ ఇచ్చింది. అటు వైపు జనసేన కూడా పోటీ చేస్తుంది. ఇక ఈ పార్టీ నుంచి పాముల రాజేశ్వరిని అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ త్రిముఖ పోరు రసవత్తరంగా సాగబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: