ఏపీలో చంద్రబాబు సర్కారుకు ఎదురుగాలి బాగా వీస్తోందని క్షేత్రస్థాయి రిపోర్టులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని.. చివరకు మంత్రులు కూడా  చాలామంది ఓడిపోవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గంలో సగానికి పైగా మంత్రులకు జనం చెక్ చెప్పబోతున్నారని సమాచారం. 

సంబంధిత చిత్రం


పరిస్థితి దారుణంగా ఉండి.. ఓటమి బాటలో ఉన్న మంత్రుల్లో కృష్ణాజిల్లాలో ఇద్దరు ఉన్నారు. మైలవరంలో మంత్రి దేవినేని ఉమ, తిరువూరులో మంత్రి జవహర్ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారట. కొవ్వూరులోనే వ్యతిరేకతతో తిరువూరుకు మారిన జవహర్‌కు ఓటమి తప్పదని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

jawahar minister కోసం చిత్ర ఫలితం

ఇక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఎదురీదుతున్నారట. గత ఎన్నికల్లో పవన్ మద్దతు పొందిన వీరు.. ఇప్పుుడు జనసేన కూడా బరిలో ఉండటం.. వైసీపీ బలంగా ఉండటంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నారట. అద్భుతాలు జరిగితే తప్ప వీరు గెలవడం కష్టమేనన్నిది క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నమాట.   
minister chinarajappa కోసం చిత్ర ఫలితం



నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సీటులో శిద్ధా రాఘవరావు, కడప ఎంపీ సీటులో మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా ఎదురీదుతున్నారట.

minister somireddy కోసం చిత్ర ఫలితం

వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన మంత్రి సోమిరెడ్డి నాలుగోసారి బరిలోకి దిగుతున్నా గెలుపు కష్టమేనంటున్నారు.
minister adinarayana కోసం చిత్ర ఫలితం



నెల్లూరు , ప్రకాశం, కడప జిల్లాల్లో వైసీపీ బలంగా ఉండటం, టీడీపీలో అంతర్గత పోరు ఈ మంత్రులకు ప్రాణసంకటంగా మారాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: