చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి. ఆయన నా జీవితం తెరచిన పుస్తకం అని చెబుతారు. మరి బాబు కుటుంబం గురించి ఎంతమందికి తెలుసు. కుటుంబం అంటే కుమారుడ్ లోకేష్ కోడలు బ్రాహ్మ‌ణి, బావమరిది బాలయ్య. వారి కుటుంబం ఇంతేనా.. అసలు బాబు సొంత కుటుబం వారి వివరాలు ఎంత మందికైనా తెలుసా..


ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు చంద్రబాబు  సొంత చెల్లెలు అల్లుడు, జూనియర్ నందమూరి తారక రామారావుకు మామ అయిన నార్నె శ్రీనివాసరావు అడుగుతున్నారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నార్నే ఎన్నో ఇంటెరెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. బాబుకు పెద్ద కుటుంబం ఉందని. అయితే మర్రి చెట్టులాంటి బాబు తాను తప్ప ఎవరూ బయటకు  కనిపించకుండా చేశారని ఆయనా షాకింగ్ కామెంట్స్ చేశారు. బాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. ఆయన పరిస్థితి ఇపుడు చాలా  దారుణంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు.


రామ్మూర్తినాయుడు మతిస్థిమితం కోల్పోవడానికి కారకులు ఎవరు అని కూడా ఆయన ప్రశ్నించారు.   బాబుకు తన  సొంత తమ్ముడుకి వైద్యం చేయించే స్తోమత కూడా లేదా అని ఆయన నిగ్గదీశారు. ఓ గదిలో బంధించి రామ్మూర్తినాయున్ని ఉంచారని నార్నె  షాకింగ్ న్యూస్ చెప్పారు. ముఖ్యమంత్రి గా ఉంటూ కోట్లకు అధిపతిగా ఉంటున్న బాబు తన తమ్ముడికి మంచి వైద్యం చేయించి ఆయన జబ్బును బాగు చేయించుకోలేరా  అని కూడా నిగ్గదీశారు.


చంద్రబాబుకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారని, సొంత కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన బాబు ఎవరినీ ఎదగనీయలేదని కూడా నార్నె హాట్ కామెంట్స్ చేశారు. ఎంతసేపూ తాను, తన కొడుకు ఇంతే బాబు కుటుంబం అని కూడా నార్నె విరుచుకుపడ్డారు. రామ్మూర్తినాయుడు 1994 ఎన్నికల్లో ఓ మారు గెలిచిన నేత అని, అప్పట్లో ఆయన‌కు టికెట్ ఇవ్వవద్దని బాబు గొడవ చేస్తే లక్ష్మీ పార్వతి జోక్యం చేసుకుని ఇప్పించారని కూడా నాటి నిజాలను నార్నె చెప్పారు. బాబుకు తన కుటుంబం పట్ల ప్రేమ లేదని కూడా నార్నె అనడం విశేషం. ఇపుడు వైసీపీలో చేరిన నార్నె బాబు మీద ఘాటైన కామెంట్స్ చాలానే చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: