మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకునే ఆలోచన వచ్చింది అనే సంగతి ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఆరంజ్ సినిమా ఆయనకు తీరని నష్టాలను తెచ్చిపెట్టింది అని చెప్పారు. అలాంటి పరిస్థతుల్లో తన కారు అమ్మేసి తన స్థాయి తగ్గ చిన్న ఇంట్లో అద్దెకు మారడం తెలిసిందే. ఆ స్థితిలో పవన్ కళ్యాణ్ నాగబాబును ఆదుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆర్థికంగా అంత ఇబ్బందికర స్థితికి చేరిన నాగబాబు.


తర్వాత బాగానే కోలుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షో చేస్తూ, మరో వైపు సీరియళ్లు మరియు చిన్నచిన్న సినిమాలు చేయడంతో ఆర్థికంగా కొంచెం బాగానే కుడురుకున్నడు. అలాగే తన తనయుడు వరు్తేజ్ కూడా మంచి సినిమాలు చేస్తూ విజయాలు సాధించడం నాగబాబు కు ఆర్థికంగా ఎంతో మెరుగైంది. పవన్ కళ్యాణ్ పార్టీ తరఫు నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు నాగబాబు ఆస్తులు 40 కోట్ల దాకా పెరిగాయి అంట. ఈ విషయాలు అన్ని మొన్న ఎంపీ నామినేషన్ వేసే అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించాడు. తనకు ప్రస్తుతం 41 కోట్ల పైబడే ఆస్తులు ఉన్నాయట. వాటి వాస్తవ విలువ చాలానే ఉండొచ్చు. మొత్తానికి ఆరంజ్ సినిమా అప్పుడు మైనస్ లో ఉన్న ఆస్తులను ఈ పదేళ్ల కాలంలో బాగానే సంపాదించాడు.


ఆర్థికంగా చితికిపోయిన సమయంలో తన స్థాయి గురించి ఆలోచించకుండా నాగబాబు సీరియళ్లలో కూడా నటించాడు. 'జబర్దస్త్' లాంటి కామెడీ షో సైతం ఆయన స్థాయికి తక్కువే. కానీ బేషజం ఏమీ లేకుండా దీంతో  కూడా పాల్గొన్నాడు. సినిమాల్లో సైతం చిన్న స్థాయి పాత్రలు చేయడానికి ముందుకొచ్చాడు. ఈ చిన్న చిన్న అవకాశాలే మళ్లీ నాగబాబును నిలబెట్టాయి. సమయానికి కొడుకు కూడా కలిసి రావడంతో నాగబాబు మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎంపీగా గెలిస్తే నాగబాబు దశ తిరిగిపోతుందనడంలో సందేహం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: