జనసేన నాయకులు తమ గెలుపు అంచనాలపై ఓ కొలిక్కి వచ్చారు. ఎన్ని సీట్లలో గెలుస్తామన్న విషయం పక్కకుపెడితే... కనీసం 25 నుంచి 30 స్థానాల్లో ఫలితాన్ని తామే శాసిస్తామన్న నమ్మకంతో ఉన్నారు. ఈ స్థానాల్లో గెలవడం కానీ.. రెండో  స్థానంలో ఉండటం కానీ జరగొచ్చని లెక్కలు వేసకుంటున్నారు. 


ఆ స్థానాలు ఏవో ఓసారి చూద్దాం.. 

పాతపట్నం, ఇచ్చాపురం, కురుపాం, నెల్లిమర్ల, గాజువాక,  పెందుర్తి, యలమంచిలి, పిఠాపురం, పెద్దాపురం, రాజోలు., కాకినాడ రూరల్, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం, పి.గన్నవరం, రాజమండ్రి రూరల్, తుని,  ముమ్మిడివరం, కొత్తపేట, 

భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం, తణుకు, కైకలూరు, అవనిగడ్డ, పెడన, విజయవాడ ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తిరుపతి, నంద్యాల, రైల్వే కోడూరు. తంబళ్లపల్లి, కావలి, నెల్లూరు అర్బన్, 


వీటిలో చాలా వరకూ గతంలో ప్రజారాజ్యం పార్టీ కొద్ది మెజారిటీ తేడాతో కోల్పోయిన సీట్లే.. వీటితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీ స్థానాలు కూడా తామే గెలుస్తామంటున్నారు. అక్కడ కాపు జనాభా చాలా ఎక్కువ కాబట్టి గెలుపు తమదే అంటున్నారు. మరి ఈ అంచనాలు ఎంత వరకూ నిజమవుతాయో. 



మరింత సమాచారం తెలుసుకోండి: