పోలింగ్ ముందు రోజు నిరసన సీన్. ఏకంగా ఈసీ ఆఫీస్ ముందు బాబు గారు ధర్నాకు దిగారు. అది అలా ఉండగా పోలింగ్ రోజు అయినా శాంతించారా అంటే రోజంతా పెడ బొబ్బలే పెట్టారు. పోలింగ్ ప్రారంభం అయిన రెండు గంటల్లోనే రీ పోలింగ్ అని డిమాండ్ చేశారు. ఆ తరువాత ఈవీఎంల మీద గొడవ గొడవ చేశారు. డిల్లీకి వెళ్ళి మరీ నానా యాగీ చేశారు.



చివరికి ఇదంతా బూమరాంగ్ అవడంతో పాటు, పార్టీ శ్రేణులు సైతం టీడీపీ ఓడిపోతోందని అంచనాకు వచ్చేలా చేసింది. ఈ పరిణామాలతో సర్దుకున్న బాబు నిన్న రోజంతా మీడియాకు లీకులు ఇచ్చారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మేమే గెలిచేస్తున్నామని గట్టిగా చెప్పారు. ఎంతలా చెప్పారంటే ఎక్కడా లాజిక్కుకు అవకాశం లేకుండా ఆయన చెప్పిన మాటలు ఉన్నాయని అంటున్నారు.
ఎవరైన ఎన్ని సీట్లు గెలుస్తారంటే దగ్గర దగ్గర అంచనాలు చెబుతారు.


  మరి ఇక్కడ చెప్పింది చంద్రబాబు కదా. అందుకే ఆయన ఏకంగా 110 నుంచి 150 సీట్లు అనేశారు. ఎక్కడ 110 మరెక్కడ 150 సీట్లు, ఏమైనా లాజిక్కు, పొంతనా ఉందా. వస్తే 110 నుంచి 120 అన్నా ఓ పద్ధతి ఉంది. లేకపోతే కే 140 నుంచి 150 అన్నా కూడా ఓ తీరు ఉంది. మరీ అటూ ఇటూ కాకుండా బాబు చెబుతున్నారంటే ఇందులో  ఓవరాక్షనే ఎక్కువగా ఉందని అంటున్నారు. తమ్ముళ్ళకు కూడా ఇది నమ్మబుల్ గా లేకపోవడమే విశేషం. అయినా బాబు ఏది చేసినా ఇలా అతి చేసే చెడగొట్టుకుంటున్నారని అంటున్నారంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: