ఒక మనిషి మీద సులువుగా కోపం వచ్చేస్తుంది. కానీ ప్రేమ అభిమానం పుట్టాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కోసారి యుగాలు, జగాలు పట్టవచ్చు కూడా. మెప్పించి గెలవడం కంటే ఎదుటి వారిని తిట్టి గెలవడం ఈజీ. ఈ కొత్త థియరీని మన రాజకీయం డిస్కవరీ చేసి నాలుగు దశాబ్దాలు దాటిపోయింది.


విషయానికి వస్తే ఏపీలో పాజిటివ్ ఓటుతో అధికారంలోకి వస్తామని చంద్రబాబు అంటున్నారు. మహిళలు, వ్రుధ్ధులు పెద్ద ఎత్తున  ఓటు వేశారని చెబుతున్నారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు. భారీ పోలింగ్ అన్నది అధికార పార్టీ గెలుపునకు సూచిన అంటున్నారు. పక్కనున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ తెలంగాణా ఎన్నికలకు ఏపీ ఎన్నికలకు అసలు పోలిక లేదు. అక్కడ బలమైన ప్రతిపక్షం లేదు. అంతా చీలిపోయి ఉన్నారు. పైగా పోలింగ్ దగ్గర పడుతున్నా కాంగ్రెస్ కూటమిలో గొడవలు అలాగే ఉన్నాయి. ఈ లోగా ఒట్ల పండుగ పూర్తి అయిపోయింది. పైగా కేసీయార్ వ్యూహాత్మకంగా మూడు నెలల ముందు నుంచి అభ్యర్ధులను ప్రచారంలో ఉంచారు. ఎక్కడా అసమ్మతి లేకుండా చేసుకున్నారు. 


ఇక తెలంగాణా సర్కార్ సంక్షేమ కార్యక్రమాలు చేసినది కూడా ఎన్నికల ముందు కాదు. దాన్ని చాల కాలంగా చేస్తూ వచ్చింది. వాటి ఫలితాలను పొందిన లబ్దిదారులు పాజిటివ్ ఓటు వేయాలని అప్పటికే నిర్ణయానికి వచ్చారు. దీనికి ఉదాహరణ రైతు బంధు పధకం. ఇది ఎన్నికల ముందు పధకం కాదు. ఇక ఏపీ విషయానికి వస్తే ఫిబ్రవరి నుంచి పసుపు కుంకుమ తాయిలాలు అందాయి. పించన్లు కూడా అపుడే పెరిగాయి. అది కూడా జగన్ హామీ ఇచ్చిన తరువాత. ఇక డ్వాక్రా మహిళల రుణాల మాఫీ  కాలేదు. రైతుల రుణాల మాఫీ అలాగే ఉంది. నిరుద్యోగ భ్రుతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఇలాంటివి ముందు పెట్టుకుని తెలంగాణా కేసీయార్ పాజిటివ్ ఓటు తో గెలిచేశారు. మనం కూడా గెలుస్తామని ఎలా చెబుతున్నారన్నది  పెద్ద ప్రశ్న. 


మరింత సమాచారం తెలుసుకోండి: