ఎన్నికల ఫలితాలు వైస్సార్సీపీ పార్టీకి అనుకూలంగా వస్తాయని చాలా మంది అధికారులు కూడా భావిస్తున్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన కూడా అధికారులు పట్టించుకోవటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగుల్లోనూ రెండు వర్గాలుగా విడిపోయారన్న టాక్ వినిపిస్తోంది. కొందరు మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తోందని హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఇన్నిరోజులు పదోన్నతులు రానివారు ప్రభుత్వం మారితే తమకు తప్పకుండా ప్రమోషన్లు వస్తాయని ధీమాతో ఉన్నారు.


ఇక కొందరైతే ఇప్పటి నుంచే వైసీపీ అధినేత జగన్ ను కలిసి తమ పదోన్నతుల గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం ఆపద్దర్మంలో ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ తరుణంలో మంత్రులు ఏదైనా పని కోసం ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.తాజాగా మంత్రులు - ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ ఉండడంతో తమ పనులు చేసిపెట్టాల్సిందిగా సంబంధిత అధికారులను పురమాయిస్తుంటే వారు అస్సలు చేయడం లేదట.


పనులు చేయకపోగా మంత్రులు - ఎమ్మెల్యేల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.. మే 23తో టీడీపీ పని ఖతం అవుతుందని.. మీరు చెప్పిన పనులు చేయాల్సిన అవసరం తమకు లేదని పేర్కొంటున్నారట.. ఇంకొందరు సీఎం చంద్రబాబుపై విమర్శలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం నిజంగానే మార్పు దిశగా వెళ్తోందా.. అనే చర్చ జోరుగా సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: