రేణు దేశాయ్.. మనందరికీ పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే తెలుసు. ఆమె తెలుగు చేసిన రెండు సినిమాలు కూడా పవన్ తోనే హీరోయిన్ గా చేసింది. పవన్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు. పవన్ తో విడిపోయాక మళ్లీ సినీరంగంలో తన ప్రతిభ నిరూపించుకుంటోంది. 


అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూదేశాయ్ తనలోని మరో కోణం ఆవిష్కరించారు. అదేమిటంటే.. ఆమె ఎడిటర్ కూడా నట. పవన్‌ తో నటించిన జానీ, ఖుషీ సినిమాలోని పాటలను తానే స్వయంగా ఎడిటింగ్ చేసిందట. తన ఎడిటింగ్ ప్రతిభ చూసి పవన్ కూడ మెచ్చుకున్నారట. 

కానీ ఎందరు మెచ్చుకున్నా.. ఎడిటింగ్ కోసం మాత్రం తనకేమీ అదనంగా డబ్బు ఇవ్వలేదంటూ నవ్వేస్తోంది రేణూ దేశాయ్.. 'నేను జానీ, ఖుషీ సినిమాలకు ఎడిటర్‌గా చేశాను.. కానీ.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె.సూర్య గారు, రత్నం గారు కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యం" అంటూ చెప్పింది రేణూ. 

అన్నట్టు రేణూదేశాయ్ మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్ అన్నమాట. కేవలం నటన మాత్రమే కాదు. మోడలింగ్, రచన, దర్శకత్వం, ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా ఆమెలో ఎన్ని కళలో.. ఒక్క ఆర్ట్ డైరెక్షన్ వంటి కొన్ని విభాగాలు తప్ప.. 24 క్రాఫ్ట్స్ లోచాలా వరకూ వచ్చని గర్వంగా చెప్పింది రేణూ.. ఇప్పుడు మీరు కూడా అంటారు కదూ.. రేణూ తక్కువదేమీకాదు అని.


మరింత సమాచారం తెలుసుకోండి: