క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. మొన్ననే స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు రేపో ఎల్లుడో చంద్రబాబునాయుడు మీద కూడా కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ తీసుకున్న తాజా నిర్ణయమే ఇందుకు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల సంఘం విధులను అడ్డుకోవటం, ఎన్నికల కమీషనర్ ను బెదిరించటం లాంటి చర్యల వల్లే కేసులు ఎదుర్కోక తప్పేట్లు లేదు.

 

సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజపాలెం మండలంలోని ఇనుమెట్ల పోలింగ్ కేంద్రంలోకి జొరబడటమే కాకుండా పోలింగ్ కు కోడెల అంతరాయం కలిగించారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన కోడెల తలుపులు వేసేశారు. దాంతో దాదపు గంటసేపు పోలింగ్ కు అంతరాయం కలిగింది. సరే ఆ తర్వాత జరిగిన గొడవంతా అందరికీ తెలిసిందే. జరిగిన ఘటన వెలుగు చూడగానే ఎన్నికల కమీషన్ మండిపోయింది. వెంటనే కోడెలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసి ఆదేశాలు అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మొత్తానికి అన్నీ కలిపి కోడెలపై కేసు నమోదుకు కారణమయ్యాయి.

 

కేసుల విషయంలో ఇపుడు చంద్రబాబు వంతు వచ్చేట్లుంది. నిజానికి చంద్రబాబు కూడా బాగా ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పాలి.  ఎన్నికల నిర్వహణలో వైసిపికి మద్దతుపలుకుతున్నారంటూ ఈసిపై ఆరోపించారు.  వైసిపి చెప్పినట్లే అయితే ఇక ఎన్నికలు ఎందుకు ? ఎంఎల్ఏలను, ఎంపిలను కూడా మీరే పెట్టుకోండి సరిపోతోంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 

నిజానికి గతంలో ఏ సిఎం కూడా ఎన్నికల కమీషనర్ ను ఇంత స్ధాయిలో దూషించిన ఘటనలు లేవు. ఓటమి భయమే చంద్రబాబుతో అలా మాట్లాండించిందనే అనుకోవాలి. నిజానికి ఈసి కూడా వైసిపి చెప్పినట్లు ఏమీ నడుచుకోవటం లేదు. కాకపోతే ఈసి చర్యలు తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఉండటంతో అవన్నీ వైసిపి చెప్పినట్లే ఈసి నడుచుకుంటోందంటూ చంద్రబాబు మండిపోయారు.

 

ఎన్నికల విధుల్లో ప్రైవేటు ఉద్యోగులను తీసుకునేందుకు లేదు. కానీ టిడిపి విద్యాసంస్ధల్లో పనిచేస్తున్నవారికి బాధ్యతలు అప్పగించారు. ఆ విషయం వైసిపి అబ్జెక్ట్ చేయగానే వారిని విధుల్లో నుండి తొలగించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ పరిధిని అతిక్రమించి చంద్రబాబు మనిషిగా మారిపోయారు. దాంతో ఆయనతో పాటు మరో ముగ్గురు ఎస్పీలపైన కూడా వేటు వేసింది. ఇలాంటి చర్యలతోనే చంద్రబాబుకు ఈసిపై మండిపోయింది. అందుకే ఈసిని కలిసిన చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలను యాధాతథంగా ట్రాన్స్ లేట్ చేసి తమకు పంపాలంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ ద్వివేదిని ఆదేశించింది. ద్వివేదిని కలిసిన చంద్రబాబు దాదాపు 20 నిముషాలు బెదిరొంపు ధోరణితో మాట్లాడారు. ఇపుడా మాటలన్నింటినీ ఈసి తర్జుమా చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ కు పంపుతోంది. ఆ టేపు కేంద్ర ఎన్నికల కమీషన్ కు చేరితే చంద్రబాబుపై కేసు నమోదు చేయటమే మిగిలిందనే  ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి ఈసిపి అనవసరంగా నోరు పారేసుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించాల్సొచ్చేట్లుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: