ఎన్నికలు ఏపీలో ముగిసాయి. మరో నెలన్నర రోజుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అంతవరకూ ఒకే. కానీ పాలన నడించేందుకు అవసమైన నిధులు ఉన్నాయా. ఇపుడు అదే పెద్ద ప్రశ్న. ఖజానా  మొత్తం ఖాళీ అయిందన్న వార్తలు అధికార వర్గాల్లో గట్టిగా  వినిపిస్తున్నాయి. ఓ విధంగా డేంజరస్ పొజిషన్లో ఇపుడు ఏపీ ఆర్ధిక పరిస్థితి ఉందని చెబుతున్నారు.


ఖజానా ఖాళీ కావడంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అతి పెద్ద సమస్య ఎదురుకాబోతోందట. మే నెల జీతాలను ఇచ్చే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలైన వెంటనే కొత్త సర్కార్ పై జనంలో భారీ ఎత్తున అసంత్రుప్తి పేరుకుపోయే అవకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇదిలా  ఉండగా ఓవర్ డ్రాఫ్ లను కూడా పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే తీసేసుకుంది. 


దాంతో మరో రెండేళ్ల వరకూ అప్పు ఇవ్వాలని అడిగినా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే పరిస్థితి ఉండదని కూడా చెబుతున్నారు. ఇక హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే ప్రభుత్వం జీతాలకు  కూడా కటకటలాడితే చాలా తొందరలోనే జనంలో వ్యతిరేకత వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. గత మూడు నెలలుగా ఎన్నో బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం పక్కక పెట్టి పసుపు కుంకుమ, రైతు పధకం, పించన్లకు వాటిని మళ్ళించిందని చెబుతున్నారు. ఇపుడు అలాంటి బిల్లులు వేల కోట్లలో పెండింగులో పడి తీర్చమంటూ కొత్త సర్కార్ ముందుకు రాబోతున్నాయి. 
ఇక ఒకటే ఆశ. కొత్త సర్కార్ కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే కొంతలో కొంత అయినా నిధుల కొరత తీరుతుందని, ఆ మీదట పాలన గాడిలో పడ్డాక మెల్లగా ఆర్ధిక వ్యవస్థను కూడా కంట్రోల్ లోకి తెచ్చుకోగలరని ఆర్హిక నిపుణులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: