రాష్ట్రంలో పోలింగ్ అయిపోగానే చంద్రబాబునాయుడు దృష్టి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మీద పడింది. తమిళనాడులో యూపిఏ భాగస్వమ్య పక్షమైన డిఎంకె పార్టీకి మద్దతుగా ఒకరోజు  ప్రచారం చేశారు. డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ నిర్వహించిన రోడ్డుషోలో పాల్గొన్నారు. తర్వాత కర్నాటకలోని జనతాదళ్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడకు మాండ్యాలో పార్లమెంటులో ప్రచారం చేశారు.

 

చంద్రబాబు ప్రచారం చేయటంపై తమిళనాడులో ఎవరూ పట్టించుకోలేదు కానీ కర్నాటకలో మాత్రం బాగా వ్యతిరేకత కనబడింది. పోటీ చేస్తున్న నిఖిల్ గౌడతో పాటు ప్రచారానికి వచ్చిన చంద్రబాబును కూడా కడిగిపారేశారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా  ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లో నెటిజన్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా చెలరేగిపోయారు.

 

నిజానికి కర్నాటకలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనాలు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కానీ తమిళనాడుతో పాటు  కర్నాటకలో కూడా ఏపి జనాలు కొన్ని లక్షల మందే ఉన్నారు. అందుకనే పై రెండు రాష్ట్రాలకు ఆంధ్ర పాలిటిక్స్ తో విడదీయరాని సంబంధాలుంటాయి. అందుకనే నెటిజన్లు చంద్రబాబుపై ఇపుడు మండిపోతున్నారు.

 

ఏపికి కాబోయే సిఎం జగన్మోహన్ రెడ్డే అని ఒకళ్ళు కామెంట్ చేశారు. ఏపిలో 420 చంద్రబాబు కర్నాటకలో మరో దొంగకు ప్రచారం చేయటమా అంటూ ఓ అత్యుత్సాహవంతుడు కామెంట్ పెట్టారు. కర్నాటక గోల నీకెందుకు ముందు ఏపిలో నీ ఉనికి కాపాడుకో అంటూ ఘాటుగా స్పందించారు ఇంకోరు.

 

లక్ష్మీస్ ఎన్టాయార్ చూస్తే నీ భాగోతం తెలుస్తుందంటూ మరొకరు స్పందించారు. దొంగల బ్యాచ్ లోనే పెద్దదొంగవి అంటూ మరొకరు స్పందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కామెంట్లే ఉన్నాయి చంద్రబాబుకు వ్యతిరేకంగా.  కొన్ని ఛానెళ్ళు నెటిజన్ల కామెంట్లను యధాతథంగా చూపిస్తున్నాయి లేండి.


మరింత సమాచారం తెలుసుకోండి: