చరిత్ర పునరావ్రుత్తం అవుతుందన్న మాట ఎలా వచ్చిందో తెలియదు కానీ అంతా నమ్ముతారు. దీనికి కారణం భూమి కూడా గుండ్రంగా ఉండడం, తిరిగిన చోటకు మళ్ళీ మళ్లీ రావడం ఓ కారణంగా భావింది అలాగే జీవితాలు కూడా మళ్ళీ మారుతాయన్న ఆశతో పుట్టిన లాజిక్ ఇది అయి ఉండొచ్చు.


ఇదంతా ఎందుకంటే ఇపుడు 2019. దీనికి సరిగ్గా పదేళ్ళ క్రితం తీసుకుంటే 2009 వస్తుంది. ఆనాడు కూడా ఉమ్మడి ఏపీలో త్రిముఖ పోరు భారీ ఎత్తున సాగింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. మొత్తం 294 సీట్లకు పోటీ చేశారు. అలాగే 42 ఎంపీ సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టారు. ఓ ప్రభంజనంగా సాగిన చిరంజీవి రాజకీయ పయనం ఫలితాలతో చప్పున చల్లారిపోయింది. ఏకంగా సీఎం అవుతానని తొడగొట్టి మరీ వచ్చిన చిరంజీవికి కేవలం 18 అసెంబ్లీ సీట్లే వచ్చాయి.ఒక్క  ఎంపీ సీటు కూడా రాలేదు. 


అయితే చిరు పార్టీకి ఏకంగా 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.  ఆ ఓట్లు భారీగా చీల్చడం వల్ల అపుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి భారీ నష్టం జరిగింది. చాలా చోట్ల టీడీపీకి పడాల్సిన ఓట్లు ప్రజారాజ్యం కొల్లగొట్టింది. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధులు సులువుగా గెలిచారు. అలా అప్పట్లో రెండవ మారు కాంగ్రెస్ సర్కార్ తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.  ఇపుడు మళ్ళీ చూస్తే ఆ చిరంజీవి తమ్ముడు పవన్ జనసేన అంటూ పార్టీ పెట్టి పోటీ చేశారు. చిరంజీవి మాదిరిగానే పవన్ కి కూడా చరిష్మా బాగా ఉంది. పైగా బలమైన సామాజికవర్గం అండ ఉంది. ఈసారి కూడా అధికారం కోసం టీడీపీ, వైసీపీ గట్టిగా పోరాడుతున్నాయి. మూడవ పక్షంగా జనసేన వచ్చింది. ఇపుడు ఆ పార్టీ  మీద అందరి చూపులూ ఉన్నాయి. జనసేన గెలుస్తుందా. ఎన్ని సీట్లు వస్తాయి. ఒకవేళ గెలవని చోట్ల ఎవరి ఓట్లు చీలుతాయి ఇపుడు ఇదే హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది.


2009 ఎన్నికల్లో చిరంజీవి రాక వల్ల టీడీపీ ఓట్లు బాగా చీలిపోయాయి. ఇక 2014 లో పవన్ సహకారం వల్ల టీడీపీ గెలిచింది. ఆ విధంగా అన్న వల్ల జరిగిన నష్టాన్ని తమ్ముడు పవన్ పూడ్చి బాబుని సీఎం చేయగలిగారు. ఇపుడు జనసేన ఒంటరి పోరు ఎవరికి చేటు అన్నది పెద్ద చర్చగా ఉంది. జనసేన ఓటింగ్ అంటే కాపుల ఫ్యాక్టర్ ఉంటుంది. కాపులు మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి  ఓటు వేశారు కాబట్టి టీడీపీకి జనసేన దెబ్బ అంటున్నారు కొందరు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీల్చడం వల్ల చిరంజీవి వైఎస్సార్ ప్రభుత్వం  మళ్ళీ రావడానికి కారణం అయ్యారని, ఈసారి యాంటీ ఇంకబెన్సీఓట్లు ఛీలిక  టీడీపీకి లాభించవచ్చు అన్ని మరి కొందరు అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: