ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కానీ.. ఎన్నికల తర్వాత కూడా రోజూ మీడియాలో రెండు పార్టీల అధినేతలు కనిపిస్తారు.. ఆరోపణలు చేస్తున్నారు.. ఆవేశపడుతున్నారు. వారిలో మొదటి వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు, రెండో వ్యక్తి కె.ఎ.పాల్. వీరిద్దరూ రోజూ ఈసీ వైఫల్యంపై ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కెఎ పాల్ రోజూ ఒకేలా మాట్లాడుతున్నారు. ఈసీ తప్పులు చేస్తూ దొరికిందని ఇటీవల చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎన్నికలలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ అడ్డంగా దొరికిపోయిందని పాల్ కూడా వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. 

ఈవీఎంలపై తన పోరాటం ఆగబోదని.. ఈ విషయంలో దేశాన్ని కదిలిస్తానని చంద్రబాబు అంటున్నారు. నర్సాపురంలో మధ్యాహ్నం వరకు ఈవీఎంలు పనిచేయలేదని, ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పుడు పాల్ కూడా అంటున్నారు. చంద్రబాబులాగనే పాల్ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను పోరాటం చేస్తున్నానని అంటున్నారు. 

చంద్రబాబు కంటే ముందే కేఏ పాల్.. పోలింగ్‌కు ముందే ఈసీపై ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు ఆపేయాలన్నారు. ఆపేందుకు ఢిల్లీ వెళ్తున్నానంటూ హడావిడి చేశారు. ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా సైలంట్‌గా ఉంటే... వీరిద్దరే ఈవీఎంల తీరుపై పోరాడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: