కర్ణాటకలో కాంగ్రెస్ జెడీఎస్ పొత్తులో తమ వాటాకు లభించిన ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో మూడు స్థానాలు దేవె గౌడ కుటుంబానికే వదిలేశారు. ఈసారి తన ఇద్దరి మనవళ్లను జెడిఎస్ తరపున ఎంపీలుగా పోటీ చేయించడంతో పాటు, తను కూడా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు దేవేగౌడ. నేడు పోలింగ్ జరగనుంది.

 

*తుమకూరు నుంచి దేవేగౌడ ఎంపీ గా పోటీలో ఉన్నారు. 

*అలాగే మండ్య నియోజకవర్గానికి కూడా రేపే పోలింగ్ జరగనుంది. మండ్యలో దేవేగౌడ మనవడు నిఖిల్ కుమరశ్వమీ ఎంపీగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ సుమలత వర్సెస్ నిఖిల్ గౌడ పోరాటం సాగుతూ ఉంది.

 *దేవెగౌడ స్వంత పార్లమెంట్ స్థానం హాసన్ నుండి దెవెగౌడ మరో  మనవడు ప్రజ్వల్ రెవణ్ణ పోటీ పడుతున్నారు. దేవే గౌడ కులపిచ్చితో విసిగిపోతున్న ఇతర కులాల్లో ఉన్న తీవ్ర వ్యతిరేఖత ప్రజ్వల్ విజయానికి బ్రేక్ వేయొచ్చు.

 

పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే.. అటు తుమకూరులో దేవేగౌడకు అంత సులభం కాదు, ఇటు మండ్యలో నిఖిల్ గౌడ కూ అంత తేలిక కాదని అంటున్నారు.

 

శ్రీమతి సుమలత అంబరీష్ మీద ప్రజల్లో సానుభూతి ఉంది. దివంగత అంబరీష్ పేరుకు ఆ ప్రాంతంలో క్రేజ్ ఉంది. మాంద్య మగాడు అంటారు ఆయన్ని. కుల సమీకరణాలు కూడా అంబరీష్ సతీమణికే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీఎస్ కు తిరుగులేని పట్టుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో జేడీఎస్ స్వీప్ చేసింది. అదే నిఖిల్ కు సానుకూలమైన అంశం.బీజేపీ బాహాటంగానే సుమలతకు సపోర్ట్ ప్రకటించింది. జేడీఎస్ కోసం పని చేయడానికి కాంగ్రెస్  సానుకూలంగా లేదు. సుమలత మీద జేడీఎస్ జనాలు సానుభూతి చూపారంటే నిఖిల్ గౌడకు కష్టమే అని చెప్పకతప్పదు.

 Image result for MLAs from Deve gowda family

ఇక ఇంతలేటు వయసులో తుమకూరులో పోటీకి దిగారు దేవేగౌడ. అక్కడ ఈయనకు విజయం అంత సులభం కాదనేమాట వినిపిస్తోంది. దానికి పలు కారణాలున్నాయి. ఇక్కడ జేడీఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వాస్తవానికి అయితే జేడీఎస్ – కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ పోరు గట్టిగా సాగుతూ వచ్చింది.

 

క్రేత్రస్థాయిలో తుమకూరు పరిధిలో కాంగ్రెస్- జేడీఎస్ లకు రాజకీయ వైరం గట్టిగా ఉంది. బీజేపీ ఇన్నేళ్లూ ఇక్కడ నామమాత్రమే. ఇప్పుడు పొత్తులో భాగంగా కాంగ్రెస్ వాళ్లు ఈసీటును దేవేగౌడకు ఇచ్చారు. ఇన్నాళ్లూ రచ్చలను మరిచిపోయి జేడీఎస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు సపోర్ట్ చేసే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తుమకూరు పరిధిలో ఇన్నేళ్లూ బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. మారిన పరిస్థితు ల్లో కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి పోటాపోటీగా మారింది.

Image result for MLAs from Deve gowda family 

మరింత సమాచారం తెలుసుకోండి: