ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ఒకరు టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కారు బోల్డులు తొలగించి తనను చంపేందుకు కుట్ర చేశారని.. ఆరోపించడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన కొన్నిరోజుల క్రితమే ఆ పార్టీ చేరి.. మళ్లీ వెంటనే బయటకు కూడా వచ్చేశారు..


ఆయనే మాజీ ఎంపీ హర్షకుమార్..  హర్షకుమార్ ఎన్నికల ముందు  అనూహ్యంగా టిడిపిలో చేరారు. కాని అక్కడ టిక్కెట్ రాకపోవడంతో బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తనను హత్య చేయడానికి టిడిపి కుట్ర చేస్తోందని ఎన్నికల ముఖ్య అదికారి ద్వివేదికి హర్ష కుమార్ ఫిర్యాదు చేశారు.

తనకు టీడీపీ అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపిందన్న హర్షకుమార్.. అందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన కారు చక్రాల బోల్టులు తొలగించి తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

అందుకే తాను సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నానని హర్షకుమార్ తెలిపారు. ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను తెలుగు దేశం పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని హర్షకుమార్ అంటున్నారు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోవడం హర్షకుమార్ కు ఇబ్బందిగా మారిందంటారు విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: