రాజ్యాంగం ప్రకారం నడచుకుంటామని ప్రమాణం చేసి గద్దెనెక్కిన మంత్రులు చివరికిలా అపహాస్యం చేయడం దారుణమే. హై కోర్టు చెప్పినా మాకేంటి అన్న తీరులో సాక్షాత్తు రాష్త్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వంటి వారే దూకుడు వైఖరి ప్రదర్శిస్తే ఇక మిగిలిన వారి సంగతేంటి.  న్యాయ వ్యవస్థను గౌరవించడం గద్దెను ఏలిన పెద్దల బాధ్యత కాదా. లేక వారు ఏమైనా అతీతులా అన్న ప్రశ్నలు కూడా పుట్టుకువస్తున్నాయి.


విషయానికి వస్తే అమరావతిలో ఈ రోజు హోం మంత్రి చిన రాజప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేసి చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ ఒక ఎత్తు ఐతే గత నెలలో  హత్య కావించబడిన వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయం మరో ఎత్తు. ఈ కేసు విషయం ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని, ఈ కేసు వివరాలు కూడా సీల్డ్ కవర్లో కోర్టు ముందు వుంచాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విధితమే. మరి అటువంటి సున్నితమైన కేసు విషయంలో హోం మంత్రి గారు పెద్ద నోరు వేసుకుని ఈ రోజు మాట్లాడేశారు.


ఏకంగా జగన్ కుటుంబమే వివేకాను చంపేసిందని దారుణమైన తీర్పు కూడా ఇచ్చేశారు. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరో వైపు హై కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినా బేఖాత‌ర్ చేస్తూ చిన రాజప్ప ఇలా మాట్లాడడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతి భద్రతలు చూడాల్సిన మంత్రి ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, హత్యా రాజకీయాలపై ప్రత్యర్ధి పార్టీని దుమ్మెతీ పోయడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో మరి. ఏది ఏమైనా నియమాలు, కట్టుబాట్లు పెద్దలే దాటేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమేముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: