అన్ని ఆశలు వదిలేసుకున్న టీడీపీ ఇపుడు ఒకే ఒక్క ఆశ పెట్టుకుంది. అదే పసుపు కుంకుమ. ఈ రెండు నిండుగా ఉంటే సౌభాగ్యమే మరి. అయితే పసుపు ఓ వైపు, కుంకుమ మరో వైపు ఉంటే సీన్ రివర్సే. అన్నీ ఇన్నీ కాదు వార్ వన్ సైడ్ అంటున్న టీడీపీకి ఈ ఎన్నికలు  అసలైన సౌభాగ్యాన్ని ఇస్తాయా. ఘనమైన విజయాన్ని అందిస్తాయా.


అంటే చాలా డౌట్లు వస్తున్నాయి అందులో కూడా. మొత్తం మహిళా లోకం టీడీపీకి గుత్తమొత్తంగా ఓటేసిందని, తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని టీడీపీ వ్యూహకర్తలు అంటున్నారు. అయితే గ్రౌండ్  రియాలిటీ చూస్తే వేరేగా ఉందని అంటున్నారు. మహిళా లోకం ఈసారి చైతన్యం బాగానే చూపించిందని అంటున్నారు. టీడీపీ ఆలొచనలు ఆశలు ఏప్రిల్ 1 వరకూ సజీవంగానే ఉన్నాయి. అయితే అక్కడే సీన్ మారిందని కూడా అంటున్నారు.


ఎన్నికలలో చివరి దశలో  వైసీపీ చేసిన ప్రచారమే పసుపు కుంకుమ బ్యాచ్ ని  వేరేలా ఆలోచింపచేసిందని అంటున్నారు. మీరు కట్టిన సొమ్మునే ఉంచుకుని సున్నా వడ్డీ కూడా లేకుండా చేసి గ్రూపునకు పదివేలు ఇస్తున్నారని వైసీపీ చేసిన ప్రచారం పెద్ద ప్రభావమే చూపిందని అంటున్నారు అప్పటివరకూ మా కోసమే పసుపు కుంకుమ పుట్టిందని భావించిన  వారు కాస్తా వేరేగా ఆలోచించారని కూడా అంటున్నారు.



ఇక ఇందులో కూడా సామాజిక వర్గాలు, మతాలు, ప్రాంతాలు, ఇతరత్రా పభావం బాగా ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ఓటింగ్ పూర్తిగా టీడీపీకి నూటికి నూరు పాళ్ళు ప్లస్ అయ్యే అవకాశాలు లేవన్నది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ గా ఉంది. మరి దీన్ని నమ్ముకున్న టీడీపీకి ఎంతవరకు కలసి వచ్చిందన్నది మే 23న ఫలితాలు తేల్చిచెప్పనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: