పార్టీల అధినేతల్లో ఎవరికి లేనంతా క్రేజు లేకపోతే నమ్మకం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కనిపిస్తోంది. ఎవరిలో అంటారా ? ఇంకెవరిలో పందెం రాయళ్ళలో. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై లేని నమ్మకం పవన్ లో పందెం రాయళ్ళకు ఏమి కనిపించింది ? ఏమి కనిపించిందంటే ఓటమి. అవును పవన్ ఓటమి విషయంలోనే పవన్ పై పందేలు కడుతున్నారట.

 

పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంతో పాటు విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలో కూడా పోటీ చేశారు. ఇంతకీ పందెంరాయళ్ళు పవన్ విషయంలో ఏమని పందేలు కడుతున్నారంటే రెండు చోట్లా ఓడిపోతారనట. ఎంత అన్యాయం. పవన్ విషయంలో పందెంరాయళ్ళకు మరీ అంత నమ్మకమా ? అని అందరూ బోలెడు ఆశ్చర్యపోతున్నారు.

 

రాష్ట్రం మొత్తం మీద అత్యంత సురక్షితమైన నియోజకవర్గాలేవీ అనే విషయంలో జనసేన నేతలు పెద్ద కసరత్తే చేశారు. దాదాపు 15 రోజులు అన్నీ విషయాలను గమనించిన తర్వాత భీమవరం, గాజువాకను ఎంపిక చేశారు. దాంతో పవన్ రెండు నియోజకవర్గాల్లోను నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన మరుసటి రోజు నుండే భీమవరంలో గెలుపు కష్టమనే ప్రచారం మొదలైపోయింది.

 

భీమవరంలో గెలవకపోయినా గాజువాకలో మాత్రం గెలుపు తథ్యమంటూ జనసేన నేతలతో పాటు ఇతరులు కూడా అనుకున్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ ఇక్కడ కూడా నమ్మకం తగ్గిపోయింది. గాజువాకలో వైసిపి, టిడిపి అభ్యర్ధులు బిసిలు కాబట్టి కాపులు ఓట్లేసినా చాలా పవన్ గెలిచిపోతారనే నమ్మంతో ఉన్నారు. కానీ పోలింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా తగ్గిపోయింది. ఎందుకేంట, అనూహ్యంగా వైసిపి అభ్యర్ధి నాగిరెడ్డి పుంజుకోవటమే.

 

ఇక్కడ చంద్రబాబు చేసిన తప్పుకూడా ఉందట. రహస్య మిత్రుడు పవన్ ను గెలిపించుకునేందుకు సొంత అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ ను త్యాగం చేయమని అడిగారట. దానికి పల్లా అడ్డం తిరిగారని సమాచారం. దాంతో పార్టీ నేతలకు చంద్రబాబు అవసరమైన సూచనలు చేశారట. ఆ విషయం తెలియటంతో పల్లా వైసిపి అభ్యర్ధికి లోపాయికారీగా మద్దతు పలికారట. దాంతో ఇక్కడ కూడా పవన్ గెలుపు అంత ఈజీ కాదనే ప్రచారం మొదలైంది. తీరా పోలింగ్ జరిగిన తర్వాత గాజువాకలో కూడా పవన్ ఓటమి తప్పదనే ప్రచారం ఊపందుకుంది. అందుకనే పందెం రాయళ్ళకు పవన్ పై విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అదే చంద్రబాబు, జగన్ గెలుపుపై పందేలు కాస్తే ఏం మిగులుతుంది బూడిద.


మరింత సమాచారం తెలుసుకోండి: