తిరుమల శ్రీనివాసుడి బంగారంగా చెప్పబడుతున్న భారీ నిల్వలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో జోరుగా తనిఖీలు సాగుతున్నాయి. రోజూ కోట్ల కొద్దీ నగదు నిల్వలు దొరుకుతూనే ఉన్నాయి. 


తాజాగా.. 1,381 కిలోల బంగారాన్ని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు  స్వాధీనం చేసుకున్నారు చెన్నైలోని వెప్పంపట్టు దగ్గర వాహనంలో తరలిస్తున్న 1,381 కిలోల బంగారాన్ని తనిఖీల్లో ఉన్న ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ గుర్తించింది. బంగారాన్ని మొత్తం రెండు వాహనాలు తరలిస్తుండగా పట్టుకున్నారు.  

ఇంత భారీ ఎత్తున బంగారాన్ని చూసి షాక్‌ తిన్న ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌.. ఆ వాహనాన్ని పూందమల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. బంగారం మొత్తం గిఫ్ట్ ప్యాక్‌లలో ప్యాకింగ్ చేసి ఉంది. ఈ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదిగా చెబుతున్నారు ఆ వాహనంలో ఉన్న సిబ్బంది. 

1,381 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దానిపై విచారణ చేస్తున్నారు. ఇంతలో ఈ విషయంపై మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వెంకన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం .. కాల పరిమితి ముగిశాక మళ్లీ తిరిగి తెచ్చుకోవడం సాధారణంగా జరిగేదే. తిరుమలేశుని విషయం కావడం వల్ల తొందపడకుండా నిజం నిగ్గుతేలే వరకూ సంయమనం పాటించడం అవసరం. 



మరింత సమాచారం తెలుసుకోండి: