ఎన్నికలకు ముందు..ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఏపిలో చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.  అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఎన్నో లోపాలు ఎత్తి చూపిస్తున్నారని..చివరకు ఈసీనే తప్పుపట్టారని..ఈవీఎం పై రాద్దాంత చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని అందుకే తనను తాను రక్షించేకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆయన అన్నారు.  ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 18 జీవోలు బాబు జారీ చేశారని. ఎన్నిక కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా జీవోలు ఎలా జారీ చేస్తారని..ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే కదా ప్రశ్నించారు. 

ఏపిలో రాబోయేది జగన్మోహన్ రెడ్డి అని..ఆయన ప్రభుత్వ పాలనలో ఏపి ప్రజలు సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారని అన్నారు.   ఇప్పటికీ చంద్రబాబు అన్ని వ్యవస్థలు ఆయన చెప్పు చేతల్లోనే ఉండాలని చూస్తున్నారని అన్నారు.   సీఎం సమీక్షలపై వైసీపీ నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పినా ఈసిని ఆయన ఖాతరు చేయడం లేదని..చంద్రబాబుకి ఇంకా పదవీ వ్యామోహం తగ్గలేదని ఆయన ఎద్దేవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: