ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చంద్రబాబు నాయుడు ఎటువంటి సమీక్షలు చేయకూడదని ఈసీ చెబుతుంది.  ఈ షెడ్యూల్ ప్రకారం... తొలి విడతలోనే పోలింగ్ ముగిసిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. అంటే పోలింగ్ కు - ఎన్నికల ఫలితాలకు ఏకంగా 43 రోజుల గ్యాప్ ఉందన్న మాట. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే దాకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లే లెక్క.


ఈ కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీ కూడా పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకోరాదు. కొత్త నిర్ణయాలు అసలే తీసుకోరాదు. ఇక సాధారణ పరిపాలనకు సంబంధించి పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. మొత్తంగా షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రభుత్వాలు ఆపద్ధర్మ ప్రభుత్వాలుగా మారిపోతాయన్నమాట. అయితే ఇక్కడ మరొక వాదన వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం ఇంకా 40 రోజులు వేచి చూడాలి. అప్పటివరకు పాలనను గాలికి వదిలెయ్యాలా .. అని ..!


 అయితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరించారన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఆయన నిన్న నేడు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కోడ్ ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే... ఫలితాలకు నెలన్నరు పైగా సమయం ఉంటే... సాధారణ పాలన సాగాలా? వద్దా? అంటూ ప్రశ్నించి మరీ సమీక్షలు నిర్వహించారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షల్లో తాగు నీటి సరఫరా పోలవరం సీఆర్డీఏ తదితర అంశాలున్నాయి. ఈ సమీక్షలకు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ విషయంపై స్పందించిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ... చంద్రబాబు కోడ్ ఉల్లంఘించినట్లుగానే చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: