టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మేనల్లుడు ధర‍్మారామ్‌ ఆత‍్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న ధర్మారామ్‌ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్‌ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. చికిత్స పొందుతూ రామ్ మృతి చెందాడు. కాగా ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్‌ ఫెయిల్ అయ్యాననే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు.


అయితే  కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు ధర్మారామ్‌ మృతదేహానికి  గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే  తెలంగాణలో ఇంటర్‌ బోర్డు ఘోరమైన తప్పిదాలు చేశారని..ఆప్ సెంట్ అయిన వారు...ప్రజంట్ అయినట్లు, మార్కుల ప్లేస్ లో ap,x  రావడం..కేవలం ఒక్క డిజిట్ మార్కులు..గత యేడాది అత్యధిక మార్కులు వచ్చినవారు..ఈ ఏడాది ఫెయిల్ కావడం ఇలా ఏన్నో తప్పిదాలు జరిగాయని తల్లిదండ్రులు ఆవేదన చెందారు.


ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదాలకు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్‌ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు.ఇంటర్‌ బోర్డు కార్యదర్శి లెక్కలేనితనానికి విద్యార్థలు బాధితులు కావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: