ఏపీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి.. పోలింగ్ తర్వాత కొన్నిరోజుల వరకూ ఏపీ సీఎం కామెంట్లా చాలా వివాదాస్పదమయ్యాయి. అందులో ప్రభుత్వప్రధాన కార్యదర్శిపై సీఎం చేసిన వ్యాఖ్యలు దుమారమే సృష్టించాయి. 


అప్పటి వరకూ ఉన్న సీఎస్ ను ఈసీ బదిలీ చేసి ఎల్వీ సుబ్రహ్మాణ్యాన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ చర్యతో భగ్గుమన్న చంద్రబాబు.. మా కార్యదర్శిని మార్చేందుకు మీరెవరంటూ ఈసీపై మండిపడ్డారు. పనిలో పనిగా ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కూడా విమర్శలు గుప్పించారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ సహనిందితుడంటా ఘోరమైన కామెంట్ చేశారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఓఛానల్లో వివరణ ఇచ్చారు. సహజంగా ఓ ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తారని.. ఇందులో భాగంగా చాలాసార్లు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందని వివరించారు. 

కానీ ఎక్కడ రూల్ బ్రేక్ చేసినా అది చట్టం దృష్టిలో నేరంగానే ఉంటుందని.. ఇది అందరు ఐఏఎస్‌లు ఎదుర్కొనే ఇబ్బందేనని వివరణ ఇచ్చారు. ఎల్వీ విషయానికి వస్తే.. అతనిపై ఆరోపణలు అన్నీ హైకోర్టు కొట్టేసిందని ఐవైఆర్ గుర్తు చేశారు. హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా చంద్రబాబు పదే పదే ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సహనిందితుడని అనకూడదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు ఇలా అబద్దాలు చెబుతున్నారో అర్థం కావడం లేదని ఐవైఆర్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: