ఎడిటోరియల్: జెడీ క్లియర్డ్: గురివింద తన కింద నలుపెరగదట! తెదేపా అధినేత అంతే!
మరిన్ని

ఎడిటోరియల్: జెడీ క్లియర్డ్: గురివింద తన కింద నలుపెరగదట! తెదేపా అధినేత అంతే!

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్దట్టుంది ఏపి అపద్ధర్మ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి అద్ధంలో చూసుకుంటే మంచిది   ఒకరి వైపు తన చూపుడువేలెత్తి చూపిస్తే మిగిలిన  నాలుగు వేళ్ళు తననే చూపిస్తున్నయని  తెలుస్తుంది.   


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  "ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేయాలని చూశారు" అని అపద్ధర్మ ముఖ్యమంత్రి ఆరోపించారు. తన పోరాటం ఎన్నికల సంఘంపై కాదని అది పాటించే విధానాలపైనే నని చెప్పుకొచ్చారు. ముందు ఎన్నికల సంఘాన్ని ధారుణంగా విమర్శించి దాని అధికారి సౌమ్యుడైన గోపాల కృష్ణ ద్వివేదిని బెదిరించిన మీరు,  ఈసి విధి విధానాలను మాత్రమే ప్రశ్నించినట్లెలా ఔతుంది?  


తిరుపతిలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి తాను తిరుపతి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు.  ఆనాటి నుంచి ఈనాటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, రాష్ట్రం కోసం నీతి, నిజాయితీతో కష్టపడి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. న్యాయం కోసం రాజీలేని పోరాటం చేశానని జాతీయస్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. 


విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలని కోరినట్లు గుర్తు చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పై తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని తీరా ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు చెయ్యకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 

 

మీ మాటాల్లో మీరు చెప్పే నిజాయతీ మీచేతల్లో కనిపించదు. గౌతమీపుత్ర శాతకర్ణికి, రుద్రమదేవి సినిమాల పట్ల మీరు ప్రదర్శించిన ద్వైదీ భావం ద్వంద విధానం  చాలు మీలో నీతి ఉందా, నిజాయతీ ఉందా, బందు ప్రీతి ఉందా, కులకాంక్ష ఉందా, ప్రాంత పిచ్చి ఉందా అని తెలియటానికి. అసలు ఆనాడు మీరు మీ ప్రభుత్వం (ఇక్కడ నిజంగా చెప్పాలంటే మీ పార్టీ అనాలి) పక్షపాతంవివక్షతో ప్రకటించిన బంగారు నందుల గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిదివిభజన హామీల సాధన కోసం దాదాపుగా ఏడాదిపాటు ధర్మపోరాట దీక్షలు చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యంచేసే పరిస్థితికి మోదీ దిగజారా రని ఆరోపించారు.


మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అధికారం మీది. అసలు మీరు దీక్షలు చేయటమేమిటి? దీక్షలు చేసేది ఎందుకు? ప్రభుత్వం దృష్టి లోకి సమస్యలను తీసుకెళ్ళటానికే కదా! కాని ప్రభుత్వం మీదే కదా! అధినేత మీరే కదా! ఇక మీరే మీ దృష్టిలోకి తెచ్చుకోవటమేమిటి? మీ 'బాడీ మైండ్ సోల్' కలసి పనిచేయటం మానేశాయా! అవి ఆటోమాటిక్ గా సింక్ అవ్వవా? మీరే శాసనసభలో ఒక రిజల్యూషణ్ పాస్ చేసి కేంద్రానికి పంపితే సరిపోదా? దీని దీక్షల పేరుతో ప్రజాధనాన్ని నీళ్ళ  ప్రాయం చెయ్యటం ఎందుకు? విభజనతో ఆర్ధికంగా చితికిన రాష్ట్రాన్ని మీ దుబారాతో కటిక దారిద్రంలోకి నెట్టేయటం కాదా!  


మీరు సంపద సృష్టించానంటారు. అదేమీ రాష్ట్రంలో కనిపించ ట్లేదు. కాని ప్రతి సంవత్సరం మీ కుటుంబం తరపున మీ లోకెష్ ప్రకటించే ఆస్తులలో కనిపిస్తూనే ఉంది. కాని రాష్ట్ర అప్పుల చిట్టా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది.   

Image result for sadineni yamini hate speech
 


కర్ణాటక, ఒడిషా ముఖ్యమంత్రులు ప్రయాణించే హెలికాప్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చేశారని కానీ ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన అధికారిని మాత్రం సస్పెండ్ చేశారని ఇదేమి వ్యవస్థ అంటూ మండి పడ్డారు. ఇందులో మనం ఆలోచించాల్సింది ఒకటుంది.


ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ ఎస్పిజీ పర్యవేక్షణలో ఉంటుంది. అందుకే ఆయనకున్న ప్రత్యేక  భద్రత  దృష్ట్యా తనిఖీలను అనుమతించరట. మీరు ప్రయాణించే వాహనాలను మీ అధికార పరిదిలో ఉన్న ప్రాంతంలో తనికీ చేస్తారా? అలాగే దేశం మొత్తం ప్రధాని అధికార పరిధి లోకి వస్తుంది కదా! ఎందుకు మోదీ అంటే మీకు వ్యక్తిగత కక్ష. విభజన ఫలాల గురించి మీరు నాలుగేళ్లు ఏమి చెశారు. గత ఒక సంవత్సరం లోపు నుండే విభజన ఫలాలు గుర్తొచ్చాయా? మీ ప్రతిపక్షంతో పాటు కొందరు రాష్ట్రాభిమానులు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ వీపులు పగలగొట్టి జైల్లో కుక్కినప్పుడు మీ తీరు ప్రజలపట్ల అత్యంత దయనీయం కాదా!

 

మీపై, మీ కుటుంబ సభ్యులపై పుష్కరాల సందర్భంగా సినిమా షూట్ చేసేటప్పుడు జరిగిన త్రొక్కిసలాటలో మరణించిన భక్తుల సంఘటనపై విచారణ చేయించారా! నివేదిక ప్రజలకు తెలిపారా? అలాగే దివాకర్ ట్రావెల్స్ బస్ యాక్సిడెంటులో మరణించిన ఇరవైమంది సంఘటనపై విచారణ చేయించి ప్రజలకు నివేదిక బహిరంగ పరచారా? ఇవన్నీ మీ వ్యవస్థల లోపాలు కావా? మీ రాష్ట్రలో బాధితులకు న్యాయం జరగదని కారణం నేరస్తులు దాదాపుగా మీ పార్టీకి చెందిన వారే ఉంటారని జనాంతికం. ఉదాహరణకు చిగురుపాటి జయరాం కేసు చాలదా!