చంద్రబాబు తరచూ ఏపీని కష్టాల్లో ఉన్న రాష్ట్రం అని చెబుతుంటారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ఏదో కష్టపడి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాని చెబుతుంటారు. అవసరమైతే చెట్టు కింద కూర్చుని అయినా పాలన సాగిస్తానని.. బస్సులో పడుకుని కూడా రాష్ట్రం కోసం కష్టపడ్డానని తరచూ చెబుతుంటారు.


కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని కూడా అంటుంటారు చంద్రబాబు. కానీ అదంతా ఒట్టి బూటకం అంటున్నారు మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి వచ్చిన సొమ్మును తనకు నచ్చిన వారి కాంట్రాక్టుల కోసం మళ్లించి ఇప్పుడు బీద అరుపులు అరుస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు.


చంద్రబాబు కేంద్రం మెడలు వంచకుండా.. ఇలాంటి మాటల వల్ల ఉపయోగం ఉండదని ఆర్కే అంటున్నారు. అంతేకాదు.. ఏపీ బీద రాష్ట్రం అయినప్పుడు ఎందుకు దుబారా చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నప్పుడు అద్దెను రాష్ట్ర ప్రజలు భరించారని గుర్తు చేస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.



లోకేశ్‌ హైదరాబాద్‌ హోటల్లో ఉన్నప్పుడు ఒక్క రోజు అద్దె అక్షరాలా మూడు లక్షల రూపాయలని ఆళ్ల అంటున్నారు. ఆ హోటల్లో ఒక్క వాటర్ బాటిల్ ఖరీదు 400 రూపాయలనీ...కాఫీ ఖర్చు 700రూపాయలని.. ఈ దుబారా ఖర్చు మొత్తం ఏపీ ప్రజల సొమ్మేనని ఆళ్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే కాదు.. అమరావతిలో చంద్రబాబు నివాసం కూడా లింగమనేని వాళ్లను బెదిరించి ఉంటున్నదేని ఆళ్ల చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: