వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మ‌రోమారు కీల‌క ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై 
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఎన్నికల కోడ్‌ను ఆయన ఉల్లంఘిస్తున్నారంటూ ద్వివేదికి ఓ లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక ప్రభుత్వ సముదాయం అని.. దానిని పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫిర్యాదుతో బాబు స‌మావేశాలు అక్క‌డ బంద్ కానున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. 


ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న‌ను పేర్కొంటూ ప్రజావేదికలో టెలీకాన్ఫరెన్స్‌లు, పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారని.. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాలు ఈసీ అనుమతితో చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంపై సీఈసీ వెంటనే జోక‍్యం చేసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు. ఈ సంఘటనలపై సమీక్షించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు పరిచేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్‌ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 
కాగా, మ‌రో ట్వీట్లో విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు తీరును ఎండ‌గట్టిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్‌ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: