ఈ ఏడాది ఇంటర్ బోర్డు లో జరిగిన తప్పుల వల్ల ఎంతో మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  పదవతరగతిలో డిస్టెన్స్ వచ్చిన విద్యార్థులు ఇంటర్ లో 1,2 మార్కులు రావడం ఆశ్చర్యం కలిగించింది.  ఈ నెల 15 అన్న ఫలితాలు వాయిదా పడుతూ..18న రిలీజ్ కావడం..కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి.  దాంతో తల్లిదండ్రుల మొన్న ఇంటర్ బోర్డు వద్ద పెద్దు ఎత్తున ఆందోళన చేశారు.  మరికొంత మంది తాము ఖచ్చితంగా పాస్ అవుతామనున్న దారుణమైన మార్కులు చూసి మనోవేదనతో ఆత్మహత్యలకు కూడా పాల్పపడ్డారు. 

అయితే ఏమైనా తప్పులు ఉంటే..సరిచేసుకునే విలు కల్పిస్తామని..రీ కరెక్షన్ చేయించుకోవచ్చని విద్యాశాఖ మంత్రి తెలుపుతున్నారు.  తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జి.నవ్య  జన్నారంలోని కరిమల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది.  ఇంటర్ మొదటి సంవత్సరంలో 98 మార్కులు తెచ్చుకుంది..కానీ ద్వితీయ సంవత్సరంలో సున్నా రావడంతో ఖంగుతిన్నారు ఆమె తల్లిదండ్రులు.  స్టేట్ ర్యాంక్ వస్తుందనుకున్న తమ కూతురు కి సున్నా రావడం ఏంటని ప్రశ్నించారు.

ఫస్టియర్‌లో నవ్య జిల్లా టాపర్‌గా నిలిచినప్పటికీ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ కావడంతో బోరున విలపించింది. ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగా పెద్ద సంఖ్యలో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలియడంతో నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో స్పందించిన ఇంటర్ బోర్డు ఆమె పేపర్‌ను సరిదిద్దింది. జరిగిన పొరపాటును సరిదిద్ది బోర్డు ఏకంగా 99 మార్కులు ఇవ్వడం గమనార్హం. అనంతరం దానిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో నవ్య కథ సుఖాంతమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: