ఏపీలో ఎన్నిక‌ల సంద‌డి ముగిసి ఫ‌లితాల కోసం ఉత్కంఠ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆస‌క్తిక‌ర త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు పవ‌న్ క‌ళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఇద్ద‌రు నేతలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా కీల‌క స‌మాశావు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌న పార్టీ సంగ‌తేంట‌నే ప్ర‌శ్న వేసుకున్నారు. 


పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యువ అభ్యర్థులతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదివారం అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ జనసేనది ఎదిగే దశ అని.. ఎంతలా మార్పు వస్తుందో తెలియదు కానీ మార్పు నెమ్మదిగా వస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే మార్పును తీసుకెళ్తామని.. తెలంగాణ ప్రజలు కూడా మార్పును ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఎన్నికలు అవగానే వైసీపీ 120 స్థానాలు వస్తాయంటే, టీడీపీ తమకు ఇన్ని స్థానాలు వస్తాయని చెబుతోంది. టీడీపీ, వైసీపీ మాదిరిగా జనసేన లెక్కలు వేసుకోదు. ఎన్నికల తర్వాత ఓటింగ్ సరళి మాత్రమే తెలుసుకోవాలని మా నేతలకు చెప్పాను' అని తెలిపారు. 


కాగా, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.  ఇవాళ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న చంద్ర‌బాబు పోలింగ్ జ‌రిగిన తీరును స‌మీక్షించ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీల వారీగా ప‌డిన ఓట్ల గురించి ఆయ‌న అడిగి తెలుసుకోనున్నారు. నియోజకవర్గాల్లో మండలాల వారికి ఓట్లు, పోలైన ఓట్లు తదితర వివరాలతో అభ్యర్థుల నుంచి వివ‌రాల‌ను అడుగుతార‌ని తెలుస్తోంది. పొలింగ్ సరళి, ఈవీఎంల పనితీరు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ ఇద్ద‌రు నేత‌లు ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌తో చేస్ఉత‌న్న రివ్యూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: