రాజు, రైతు అంటారు, అంటే రైతు చిన్నవాడు, రాజు పెద్దవాడు అని అర్ధం వస్తోందక్కడ. కానీ రైతు రాజు కంటే గొప్ప అని ఎన్నో విషయాలు రుజువు చేస్తాయి. దేశానికి అన్నం పెట్టేవాడు రైతు. కల్మషం లేకుండా ప్రక్రుతితో మమేకమై లోకానికి ఆకలి లేకుండా చేసే వాడు రైతు. రైతు పట్ల పాలకులకు చిన్న చూపు ఉండొచ్చేమే కానీ రైతు మాత్రం అందరి పట్ల మానవత్వంగానే ఉంటాడు.


ఇక రైతులకు ఏమీ తెలియదని, వారు పల్లెటూళ్లలో ఉంటారని, ఏమైనా హామీలు ఇచ్చి మోసం చేయవచ్చునని అనుకుంటారు. రైతు మౌనం చేతగానితనం కాదు, పెద్దమనిషితనం.  నోరు విప్పినా  ఈవీఎం  మీట నొక్కినా పాలకులే కకావికలవుతారు. రాజ్యాలే తల్లకిందులవుతాయి. విషయానికి వస్తే అస్త్రం అనే ఓ టీవీ వారు ఏపీ రాజకీయంపైనా,  చంద్రబాబు ఈవీఎంల గోల మీద  రైతును ఇలా పలకరించారు, అంతే అంతా షాక్ తినేలా ఆ రైతు వెంట ఎన్నో విషయాలు అలా గటగట వచ్చేశాయి. ఆ వీడియో ఇపుడు తెగ వైరల్ అవుతోంది.


ఏం 2014 ఎన్నికల్లో ఈవీఎం లు లేవా. అపుడు చంద్రబాబు గెలవలేదా, నాలుగేళ్ళ పాటు మోడీని పక్కన ఉంచుకుని ఆయన గొప్పోడు అని చెప్పిన బాబు ఇపుడు ప్లేట్ ఫిరాయించడమేంటి, ఈవీఎంలు బాగా పనిచేశాయి. అర్ధ్ర రాత్రి వరకూ మేమంతా క్యూలో నిలబడి ఓటేశాం. కసిగా ఓటేశాం అంటూ రైతన్న చెబుతూంటే ఆ వీడియో చూసేవారికి నోట మాట రాదుగా. ఇంతేనా ఏపీలో పాలనా తీరుతెన్నుల గురించి కూడా రైతన్న తనదైన భాషలో ఏకి పారేశాడు.


వచ్చేది జగనన్న, మేమంతా ఆయనకే ఓటేశామంటూ డేరింగ్ గా ప్రకటించేశాడు. చంద్రబాబు పెద్ద మనిషిలా రాజకీయాలు చేయాలి కానీ పూటకొకలా మాట్లాడకూడని రైతన్న అంటూంటే అమ్మో అనుకోవాల్సిందే. ఏపీలో జనం మార్పు కోరుకుంటున్నారు కాబట్టే నిలబడి మరీ గట్టిగా ఓటేశారని రైతన్న చెబుతూంటే ఇంక వేరే ఏ సర్వేతో పని ఉందా. మొత్తానికి తాము  పధ్ధతిగా ఉంటామని, రాజకీయాలు కూడా పద్ధతిగా చేసేవారినే ఆదరిస్తామని లాస్ట్ పంచ్ కూడా రైతన్న వేశాడందోయ్.


ఇక కేసీయార్ తో బాబు కులాసా కబుర్లు చెప్పిన వీడియోలు చూశామని, జగన్ కి కేసీయార్ కి కలిపి కట్టేస్తే నమ్మేస్తామా అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, బాబు, పవన్ ల సేహాన్ని కూడా కళ్ళారా చూశామని, దానికి రామోజీరావు మనవరాలి పెళ్ళిలో వంగి వంగి పవన్ బాబుకు పెట్టిన వందనాలే సాక్ష్యం అని కూడా రైతు భజాయించి చెప్తూంటే రాజకీయాల గురించి వాళ్ళకు తెలియవు అనుకోవడమే అసలైన తెలివి తక్కువతనం అనిపిస్తుంది. మొత్తానికి సాధారణ రైతన్న ఏపీలో బాబు రాజకీయంపై గట్టి సెటైర్లే వేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: