ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చోటు చేసుకున్న స‌మ‌యంలోని బాగోతాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు పాల‌న నాటి అవినీతిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా...దాన్ని నిజం చేస్తూ సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు ఉదంతం క‌ల‌కం రేకెతిస్తోంది. దొంగ బిల్లుల‌తో ఆయ‌న ఏపీ స‌ర్కారుకు బొక్క‌పెట్ట‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వ ధ‌నం దుర్వినియోగం చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో నివాసం ఉంటున్నట్టు ఇక్కడి టిడిపి నాయకుడి ఇంటిని చూపించి తప్పుడు బిల్లులతో నెలనెలా అలవెన్సులను తీసుకుంటున్న ఉదంతం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.


తెలుగుదేశం పార్టీ ఏలుబ‌డిలో జ‌రిగిన అవ‌కత‌వ‌క‌ల్లో సంచ‌ల‌న సృష్టించిన ఈ అంశంలో...హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 7లో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌కు చెందిన ఓ భ‌వంతి ఉంది.అయితే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన అధికారికంగా నివాసంగా ఈ కార్యాలయాన్ని చూపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీకర్ కోడెలకు నెల‌నెలా అద్దె కూడా చెల్లిస్తోంది. ప్రభుత్వం చెల్లించిన అద్దెను ఏపి  స్పీకర్ కోడెల శివప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్నారు. అయితే ఇక్క‌డే అస‌లు మ‌త‌ల‌బు ఉంది.


స్పీకర్ కోడెల శివప్రసాద్ నిజానికి గుంటూరు లేదా నరసరావు పేటలోని తన ఇంట్లో ఉంటారు. లేకపోతే సత్తెనపల్లిలో ఉన్న మరో ఇంటికి వెళ్లి వస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండలేదు. అంతేకాకుండా, దేవేంద‌ర్ గౌడ్‌ చెందిన ఈ బిల్డింగ్‌ను ఒక ప్రైవేటు కంపెనీకి అద్దెకిచ్చారు. ఆ భవనంలో మల్టీప్లెక్సెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే ఆఫీసుకు చెందిన కార్యాలయం ఉంది. ఆ ఆఫీసు వాళ్లు ప్రతి నెలా దేవేందర్‌గౌడ్‌కు అద్దె చెల్లిస్తున్నారు. అయితే, అదే భ‌వ‌నంలో ఉంటూ, త‌న క్యాంప్ ఆఫీసుగా పేర్కొంటూ...కోడెల నెలనెలా అద్దె పేరుతో ఇలా స్పీకర్ బిల్లులను తీసుకోవడం ప్ర‌భుత్వంలోని అవినీతికి తార్కాణ‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: