ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని ఆనాడు తెలుగు బిడ్డ ప్రధాని పీఠం ఎక్కిన సమయంలో పీవీ నరసింహారావు అన్నారు.  దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ జరుగుతుంది.  మొత్తం 116 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇవాళ ఓటు వేసే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీనగర్‌లోని నివాసంలో తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.


ఈ సందర్భంగా.. చీరను కానుకగా ఆమెకు చీరను బహుమతిగా ఇచ్చారు. . ప్రధాని మోదీ కూడా అహ్మదాబాద్‌లోని రనిప్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ఓటు చాలా విలువైనది.. దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయించబోతోందన్నారు.


కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనసరిగా ఓటు వేయాలని కోరారు. అహ్మదాబాద్‌లో ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రధాని మోదీ గాంధీనగర్‌ వెళ్లారు. అక్కడ తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: