ఏపీలో ఎన్నడూ లేని విచిత్ర రాజకీయం కనిపిస్తోంది. ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం వేచి చూడడానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది ఈసారి. ఇదే ఇపుడు ప్రధాన పార్టీలకు రచ్చ  రచ్చగా ఉంది. ఓ వైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘన‌, మరో వైపు ఈసీ మీద నిందలు, ఇంకోవైపు ఈవీఎంల మీద గోల ఇలా రాజకీయం టీడీపీ సైడ్ సాగుతోంది.


చంద్రబాబు రెండు రోజులు ఏపీలో ఉంటే మరో రెండు రోజులు ఇతర రాష్టాల ఎన్నికల  ప్రచారంలో ఉంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా మోడీని తిట్టడం మానడంలేదు. ఏపీకి వస్తే జగన్ని, కేసీయార్ని విమర్శిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఏపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల తరువాత ఫలితాల విషయంలో నిజానికి ప్రతిపక్షం టెన్షన్ గా ఉండాలి. కానీ జగన్ కూల్ గా ఉన్నారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు. 


ఆయన హ్యాపీగా విదేశాలకు విహారానికి వెళ్ళిపోయారు. తన భార్యా పిల్లలను తీసుకుని జగన్ ప్రశాంతంగా నాలుగు రోజుల పాటు గడుపుతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన ప్రజల కోసం ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ గడిపారు. మరి ఇపుడు తీరిక దొరికింది. దాన్ని ఆయన ఎంజాయ్ చెయడానికి వాడుకుంటున్నారు.


మరో వైపు చంద్రబాబు మాత్రం పూర్తి ఇరిటేషన్ తో ఉన్నారు. ఆయన సర్వేలు అన్నీ సరి చూసుకుంటున్నారు. గెలుస్తామని ఓ వైపు చెబుతున్నారు. మరో వైపు గెలవమేమోనని కంగారూ పడుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారం కూడా చేస్తానని దేశాలు పట్టి తిరుగుతున్నారు. మొత్తానికి బాబు  వ్యవహారం చూస్తే బేజారెత్తిపోతున్నట్లుగా ఉంది. ఫలితాలు ఎలా వస్తాయో  ఎవరికీ తెలియదు కానీ జగన్ కూల్ గా ఉండడం, బాబు కంగారు చూస్తున్న వారికి మాత్రం ఏపీలో అధికార మార్పిడి తప్పదేమో అనిపిస్తోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: