భీమవరంలో పవన్‌ ను ఓడించేందుకు కుట్ర జరిగిందా.. ఇందుకోసం ఒకదశలో టీడీపీ- వైసీపీ స్థానిక నాయకులు చేతులు కలిపారా.. అన్న వార్తలు వస్తున్నాయి. పోలింగ్ తీరును పరిశీలించిన తర్వాత ఇలాంటి కథనాలు వెలువడుతున్నాయి. 


పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్‌ను ఓడించేందుకు టీడీపీ  వైసీపీ నాయకులు ఇద్దరూ ఓటర్లను మభ్యపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచనలన ఆరోపణ చేశారు. అక్కడ ఓటుకు రూ.3 వేలు పంచారని ఆయన అంటున్నారు. ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు వేల కోట్లు ఖర్చు చేశాయని..  రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ పని చేస్తోందా అనే అనుమానం కలుగుతోందని రామకృష్ణ పేర్కొన్నారు. 

మరి ఈ ఆరోపణ నిజమా.. కాదా అనే విషయం భీమవరం ప్రజలే చెప్పాలి.. దీనికి మరో సాక్ష్యంగా బెట్టింగ్ మాఫియా నిలుస్తోంది. భీమవరంలో పవన్ ఓడిపోతారంటూ పందేం కాసేవాళ్లు ఎక్కువయ్యారట. పవన్‌ను ఓడించడం కోసం టీడీపీ- వైసీపీ నేతలు ఒకరి కొకరు సహకరించుకున్నారట. 

ఇక్కడ టీడీపీ అభ్యర్థి కాస్త మెతకదనం ఉన్న వ్యక్తి కావడంతో వైసీపీ దూకుడు ప్రదర్శించి టీడీపీ నేతలను ఒప్పించి వైసీపీకే టీడీపీ ఓట్లు వడేలా ఒప్పించారని కూడా చెబుతున్నారు.  ఐతే.. పవన్ విజయం కోసం ఇక్కడ యువత, ఎన్నారైలు బాగానే కృషి చేశారు. మరి ఈ నేపథ్యంలో భీమవరం ఫలితం ఏమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: