ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల్లో ఖర్చుపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు చేశామని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. జనం ఓటుకు ఇంత ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని.. ఇవ్వకపోతే ఓట్లు వేయడం లేదని ఆయన అంటున్నారు. 


తాము ఖర్చు చేసిందంతా అవినీతి సొమ్మే అని కూడా ఆయన అంటున్నారు. ఎన్నికలు జరిగిన తీరుపై ఆక్రోశంతో ఆయన ఆ మాటలు అన్నారని అనుకుంటే పొరపడినట్టేనట. ఆయన జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఇలా లైన్ చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

జేసీ దివాకర్ రెడ్డి మాటల ద్వారా పవన్ కల్యాణ్ జీరో బడ్జెట్ రాజకీయం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ భవిష్యత్ ఉండదు కాబట్టి.. జేసీ ఫ్యూచర్ ప్లాన్‌లో భాగంగానే ఈ డైలాగ్స్ విసిరారని భావిస్తున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్దామన్నా అక్కడకు రానిచ్చే పరిస్థితి లేదు. 

ఈ ఎన్నికల తర్వాత రాజకీయమంతా వైసీపీ, జనసేన చుట్టూనే తిరుగుతుందని.. తెలుగుదేశం మూడో స్థానానికి వెళ్లిపోతుందని జేసీ భావిస్తున్నారట. అందుకే ముందు జాగ్రత్తగా ఆయన పవన్ జీరో బడ్జెట్ పాలసీని సపోర్ట్ చేస్తూ అలా మాట్లాడారని ఓ అంచనా. మరి ఇది ఎంతవరకూ నిజమవుతుందో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: