బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నేడు నరేంద్ర మోదీ తో ఇంటర్వ్యూ తీసుకున్నారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగా విషయాలు..మనసులో మాటలు అక్షయ్ తో పంచుకున్నారు.  తాజాగా ఆయన మాట్లాడుతూ.. తనకు బయోగ్రీఫీలు చదవటం అంటే ఎంతో ఇష్టమన్నారు.  ఒక దశలో సన్యాసం కూడా తీసుకోవాలని అనుకున్నారట. అయితే తన జీవితంలో ప్రధాని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. రాజకీయాలు కాకుండా ఇత విషయాలు మాట్లాడటం ఆనందంగా ఉంటుంది. 
Image result for modi akshay kumar interview
నేను నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా.  ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉండటం వల్లే తాను ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఈ స్థాయికి వచ్చానని అన్నారు.  నేను పరి చేస్తూ..అందరితో పని చేయిస్తాను. నాతో సమావేశాల్లో ఎవరూ మోబైల్ ఫోన్లు వాడరు. నేను కూడా ఎవరితోనైనా భేటీ అయినపుడు ఫోన్ మాట్లాడను.  నేను మూడున్నర గంటలకు మించి ఎక్కువగా నిద్రపోను. 

నేను అందరితో సరదాగా గడపాలనుకుంటాను..వారు కూడా నాతో అలాగే ఉండేలా చూస్తాను.  అధికారులందరికీ నేను ఒక నేతలా కాకుండా ఓ స్నేహితుడిలా ఉంటాను.  మమతా బెనర్జీ నాకు అప్పుడప్పుడూ బెంగాలీ మిఠాయి పంపుతుంటారు.  స్కూల్ సమయంలో బ్యాంక్ ఖాతాలు తెరచినా డబ్బులు వేయలేదు. ప్రతిపక్షంలో నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు.  ఆజాద్ నాకు ఆప్తమిత్రుడు, రామకృష్ణ మిషన్ నాకు స్పూర్తి. 

32 సంవత్సరాలు జీరో బ్యాలెన్స్ తో అది కొనసాగింది.  ఎంత బిజీగా ఉన్న అప్పుడప్పుడ అమ్మను కలిసి వస్తాను.  కొన్ని పనుల విషయాల్లో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాను..నేను కఠినంగానే ఉంటారు.   ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ భావించలేదు..ఆ ఆలోచన  కూడా నాకు రాదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: