టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచే అభ్యర్థులపై జగన్ ఓ కన్నేసి ఉంచారా.. గెలుపునకు కాస్త అటు ఇటూగా ఉంటే.. వారు పనికొస్తారని ఇప్పటి నుంచే దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారా.. అవునట. ఈ సమాచారం టీడీపీ వర్గాల నుంచే వస్తోంది మరి. 


వల్లభనేని వంశీ, బీసీ జనార్దన రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌ వంటి వారిపై హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులు బూచిగా చూపి, ఒత్తిడి తెచ్చి వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతే కాదు.. వీరిని ఎన్నికల ముందు కూడా వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నించారట. కానీ వారు లొంగలేదట. 

తెలుగుదేశం పార్టీలో ఖాయంగా గెలుస్తారని అనుకొన్న వారిపై వల వేసే ప్రమాదం ఉందని... జాగ్రత్తగా ఉండాలని ఇటీవల చంద్రబాబు కూడా తమ పార్టీ నేతల సమావేశంలో  హెచ్చరించారు. గెలుపుపై అనుమానం ఉన్న పార్టీలు మన వాళ్లపై దృష్టి పెడుతున్నారని వార్తలు వస్తున్నాయన్నారు.  గెలుపు గుర్రాలపై కన్నేస్తారు. అందరూ ఎవరి జాగ్రత్తలో వారు ఉండండి అంటూ ఆయన పార్టీ నేతలను హెచ్చరించారు. 

అయినా.. ఇప్పుడు నాయకులు పార్టీల గురించి ఆలోచించే రోజులు ఉన్నాయా.. అధికారం వస్తుందంటే తక్షణం పార్టీ జంప్ చేసేందుకు వెనుకాడుతున్నారా.. గతంలో ఇలా చంద్రబాబు ఎంతమందిని వైసీపీ నుంచి లాక్కోలేదు.. ఇవన్నీజనం అప్పుడే మరచిపోతారా.. కానీ చంద్రబాబు చేసిన పనే జగన్ చేస్తే తేడా ఏముంటుందన్నదే ప్రశ్న.



మరింత సమాచారం తెలుసుకోండి: