ఏపీ ఎన్నికల విషయంలో ఓటర్ల మనోగతం ఏంటన్నది వూహకు అందడంలేదు. భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఇప్పటికి పదిహేను రోజులు గడచినా కూడా కచ్చితమైన ఓ అంచనాకు తలపండిన రాజకీయ విశ్లేష్లకులు సైతం రాలేకపోతున్నారు. ఇక ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపైన రాజకీయ పార్టీలు బయటకు ధీమాగా ఉన్నప్పటికీ లోలోపల గుబులు అలాగే ఉంది.


ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ టీడీపీలో కనిపిస్తోంది. అధికార పార్టీగా ఉన్న  పసుపు పార్టీ రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని పట్టుదలగా ఉంది. ఇది చారిత్రక అవసరమని ఎన్నికల్లో జనాలకు చెప్పిన చంద్రబాబు మరి ఆ అవసరాన్ని ప్రజలు కనుక గుర్తించకపోతే ఏం చేయాలన్న దానిపైన కూడా గట్టి ప్రణాళికలే రూపిందించుకున్నారని టాక్. ఏపీలో హోరా హోరీ పోరులో హంగ్ కూడా రావచ్చునని మాట ఇపుడు బయటకు వస్తోంది


ఒకవేళ హంగ్ వస్తే చేయాల్సిందేంటి అన్నది కూడా టీడీపీ మరో ప్లాన్ రెడీ చేసిందని అంటున్నారు. ఎటువంటి మొహమాటం లేకుండా వైసీపీ, జనసేనల్లో గెలిచిన వారిని ఫిరాయింపచేసైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందేనని కూడా టీడీపీ ఆలొచిస్తోందని అంటున్నారు. అంటే ఎటువటి అరాచకమైనా చేసైన ఏపీలో అధికారం నిలబెట్టుకోవాలని పార్టీలు చూస్తాయని అర్ధమవుతోంది. దీంతో మే 23న ఫలితలు ఎలా వస్తాయో, ఆ తరువాత ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అందరిలో  పట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: