జనసేన పార్టీ గుర్తు గ్లాజు గ్లాసు అన్న సంగతి తెలిసిందే.. ఏపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ గుర్తు వచ్చినా పవన్ కల్యాణ్ సేన బాగానే దీన్ని జనంలోకి తీసుకెళ్లింది. టీ కొట్ల ముందు నాయకులు ఓటర్లకు టీలు తాగించి బాగానే ప్రచారం చేశారు. 


దీంతో ఇప్పుడు జనసేన గుర్తు గాజుగ్లాసు అనే సంగతి ఫిక్సయ్యింది.. కానీ ఇప్పుడు కొన్నిచోట్ల జనసేనకు ఓటేయాలంటే గాజు గ్లాసుకు కాదు బ్యాటు గుర్తుకు వేయాలి. అదేంటి.. జనసేన గుర్తు ఎప్పుడు మారిందంటారా.. గుర్తు మారలేదు.. కానీ తెలంగాణలోని  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం మాత్రం బ్యాటు గుర్తు ఇచ్చారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సింబల్ కు సంబంధించి ఒక మార్పు జరిగింది. జెడ్పీ టీసీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తునే కేటాయించినప్పటికీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం క్రికెట్ బ్యాట్ గుర్తును ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మార్పును ఓటర్లు, పార్టీ శ్రేణులు గమనించాలని జనసేన తెలంగాణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ మేరకు జనసేన ఓ ట్వీట్ చేసింది. రెండు ఎన్నికలు ఒకేసారి ఉండటం వల్ల ఎంపీటీసీ ఎన్నికలకు బ్యాటు గుర్తు ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలే కొత్త గుర్తు.. మళ్లీ అందులోనూ మార్పులు.. దీనికితోడు తెలంగాణలో జనసేన ప్రభావం తక్కువ. మరి ఈ గుర్తు మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: