సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అని చెప్పాలి. ఇతనికి చంద్రబాబుకు అసలు పడటం లేదు.  సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ కు అనుకూలంగా ఉన్నాడని చంద్రబాబు వాదన. కొంతమందేమో జగన్ కాబోయే సీఎం అని అందుకే బాబును లెక్కచేయడం లేదని మాటలు వినిపిస్తున్నాయి.  కొత్త సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో చంద్రబాబు గుస్సా అవుతున్నారు. 'ఆయన సమీక్షలు జరపడమేంటి.? ఆయనకు ఆ హక్కు ఎక్కడిది.?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, పలువురు టీడీపీ నేతలూ నిలదీసేస్తున్నారు.


ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించిన విషయాలపై సీఎస్‌ సమీక్షించడంతో తెలుగుదేశం పార్టీ నేతల అసహనం పతాక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చే క్రమంలో ఘాటైన కౌంటర్‌ ఇచ్చారాయన. 'సీఎస్‌ బాధ్యతల్ని నేను సమర్థవంతంగా నిర్వహించాల్సి వుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో వున్నందున, నా బాధ్యతలు నేను నిర్వర్తించి తీరాలి.. అదే సమయంలో రాజకీయ నాయకులూ తమ పరిమితులకు లోబడి వ్యవహరిస్తే మంచిది..' అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీడీపీ షాక్‌కి గురయ్యింది.


సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం డైరెక్ట్‌గానే టీడీపీకి కౌంటర్‌ ఇచ్చారు. 'రాజకీయ నాయకులే జాగ్రత్తగా వుండాలి' ఆయన చేసిన సున్నిత హెచ్చరిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.  సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, సీఎస్‌ ద్వారా కౌంటర్లు వేయించుకునే స్థాయికి తన పరిస్థితిని దిగజార్చేసుకోవడం ఆశ్చర్యకరమే. ఇప్పుడిక సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై చంద్రబాబు గగ్గోలు ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: