టీటీడీ బంగారం అంటే మానవులది కాదు కోటానుకోట్లమంది కిలిచే ఆ దేవదేవుడిది. మరి స్వామి వారి బంగారానికి ఎందుకు కాపలా అనుకున్నారో ఏమో కానీ రాత్రికి రాత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా డొక్కు వ్యానులో తరలించేశారు. ఇందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు టీటీడీ అధికారులు బాధ్యత వహించాలి.



టన్నులకు టన్నులు బంగారం ఇలా ఎటువంటి భద్రతా లేకుండా వస్తూంటే ఎవరికైనా అనుమానం రావడం సహజం. అదేంటో ఇప్పటికీ అటు టీటీడీ కానీ, ఇటు బ్యాంక్ వారు కానీ  ఈ విషయంలో కిక్కురుమనకపోవడమే అసలైన విడ్డూరం. దీంతోనే ఇందులో ఏదో మతలబు ఉందని అంతా అనుకుంటున్నారు. నిజానికి బ్యాంకులో ఉంచిన బంగారం గడువు తీరేది ఈ నెల 18వ తేదీన. మరి ఒక రోజు ముందుగా ఎందుకు తరలించారు. దాని విషయంలో టీటీడీకి సమాచారం ఉందా.



ఉంటే ఎందుకు పట్టనట్లుగా వ్యవహరించారు. వచ్చిన బంగారాన్ని కొల, తూనిక  చూసి, నాణ్యత చూసి భద్రపరచేందుకు ఎంతమంది అధికారులు అందులో పాల్గొన్నారు. ఇలాంటివేమీ లేవంటేలేవు. అద్రుష్టం బాగుంది కాబట్టి బంగారం చెన్నై చెక్ పొస్ట్ పోలీసుల కళ్ళకు చిక్కింది. లేకపోతే ఆ బంగారం సంగతి గోవిందాయేనా అన్నది కూడా వినిపిస్తున్న మాట. ఇంత జరిగినా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు తమకేం తెలియదని తప్పించుకోవడం అసలైన విడ్డూరం.


ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటంటే వచ్చినది 1381 కిలోల బంగారం, కానీ నిజానికి అసలు రావాల్సింది 1750 కిలోలు అంటున్నారు. అదే నిజమైతే మిగిలిన బంగారం సంగతేంటి. అవును కానీ వచ్చిన బంగారమంతా నాణ్యత కలిగినదేనా. ఇందులో నకిలీ లేదు కదా ఇది కూడా పెద్ద డౌటే. ఇలా ఎన్నో విషయాలు ఉన్నా కూడా ఎవరినీ ఏమీ అడగకూడదు, అడిగినా ఎవరూ చెప్పారు. ఇది దేవ రహస్యం మరి. అందుకే అంతా గప్ చుప్


మరింత సమాచారం తెలుసుకోండి: