అదేంటో తెలుగుదేశం పార్టీకి ఇపుడు రోజులు బాలేనట్లున్నాయి. ఓ వైపు ఎన్నికలలో పార్టీ విజయంపై ధీమా సడలుతోంది. ఇంకోవైపు నెల రోజులకు పైగా అధికారం ఉన్నా ఏపీలో బాబును పక్కన పెట్టేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్యం చేస్తున్నారు. టీడీపీ ఇపుడు ఏం మాట్లాడినా కూడా అది రివర్స్ గేర్ లో వెనక్కి వస్తోంది. మరో వైపు విపక్ష వైసీపీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఇపుడు మరో అవాంతరంగా ఆ షాకింగ్ న్యూస్


సీబీఐ నుంచి కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరికి పిలుపు వచ్చింది. రేపు  తమ ముందు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. రెండేళ్ల కిందట ఆయనపై ఓ కేసు నమోదైంది. ఈ క్రమంలో సీబీఐ బెంగళూరు బ్రాంచ్‌ ఆయనకు నోటీసు ఇచ్చింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్లాది రూపాయల నష్టం చేకూర్చినట్లు సుజనాపై కేసు నమోదైంది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసులో గురువారం సమన్లు జారీ అయ్యాయి. ఈక్రమంలో రేపు  మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు వెళ్లనున్నారు మాజీ మంత్రి సుజనాచౌదరి.


మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేక పాత కేసులు ఉన్న పార్టీ  వారికి సరిగ్గా ఇదే సమయం చూసి సీబీఐ  వరస సమన్లు ఇస్తుందా అన్నది చూడాలి. ఇక ఓ వైపు సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ అంటూ బాబు పెడుతున్న గగ్గోలుకు ఇదిపుడు అదనమవుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: