న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. కృష్ణా జిల్లాలో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ 10 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోగా.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో న్యూ ఆంధ్రా సర్వే ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ -వైసీపీ హోరాహోరీగా పోరు ఉంది. 

ఈ ఎన్నికల్లో వైసీపీ , టీడీపీ చెరో ఐదు స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటాయని ఈ సర్వే చెబుతోంది. మరో ఆరు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేనంత టఫ్ పైట్ ఉందని ఈ సర్వే వివరిస్తోంది. ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. 

అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: