సప్త సముద్రాలు ఈది వచ్చిన గజ ఈత గాడు.. పిల్ల కాలువలో బొక్క బోర్లా పడ్డాడని ఓ సామెత ఉంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అలా తయారైందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం.. దేశ ప్రధానులనే నిర్ణయించిన ఘన చరిత్ర క్రమంగా మసకబారుతున్నాయా అనిపిస్తోంది. 


కేఏ పాల్.. ఇప్పుడు ఏపీలో ఈయన సూపర్ కామెడీ పీస్‌ గా తయారయ్యారు. మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఈయన ఈసీ ముందు రోజుకో సారి ప్రత్యక్షమవుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈయన్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు లేవు. 

ఆయన కొన్ని రోజుల క్రితం ఈసీని కలసి.. ఈవీఎంలను రష్యా నుంచి హ్యాక్ చేసే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. కొన్ని రోజులాగ ఈవీఎంలపై దుమ్మెత్తిపోస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు పాల్ ను కూడా ఫాలోఅవుతున్నారు.

కేఏ పాల్ రష్యా నుంచి హ్యాక్ చేస్తారని ఆరోపణలు చేసిన రెండు రోజలకు ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పాట పాడుతున్నారు. ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి రష్యన్ టెక్నాలజీతో ఈవీఎంలను హ్యక్ చేసే అవకాశం ఉందంటున్నారు. చంద్రబాబు ఈ పరిస్థితిని చూసి చివరకు పాల్ కూడా ఫాలో అవుతున్నారా అని విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: