రోజురోజుకు చంద్రబాబునాయుడుకు ఎలక్షన్ కమీషన్ తో గొడవలు పెరిగిపోతున్నాయి.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేశారు. తన అధికారాలను ద్వివేది అడ్డుకుంటున్నారంటూ పిర్యాలో చెప్పటంతో  వివాదం మలుపు తిరిగింది. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఈసి అనుకోవటమే చంద్రబాబు దృష్టిలో తప్పయిపోయింది.

 

 ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహించేకూడదన్నది ఎన్నికల కోడ్ లో ఎప్పటి నుండో ఉన్న నిబంధన. అయితే అన్నింటికీ తాను అతీతుడనని అనుకునే చంద్రబాబు తన చిత్తం వచ్చినట్లు సమీక్షలు నిర్వహించటమే ఇపుడు గొడవలకు దారితీస్తోంది. నిజానికి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా రోజులు ప్రభుత్వ పరిధిలోని  ప్రజా వేదిక నుండే మీడియా సమావేశాలు కూడా పెట్టారు.  అలాగే పలువురు శాఖాధిపతులతో సమీక్షలు కూడా నిర్వహించారు.

 

చంద్రబాబు ఇలా సమీక్షలు నిర్వహించటంపై వైసిపి సీఈసీకి ఫిర్యాదులు చేసింది.  డిల్లీ నుండ వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల కమీషనర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు సమీక్షల్లో పాల్గొన్న అధికారులను ఎల్వీ సంజాయిషీ అడిగారు.  దాంతో తన సమీక్షలకు హాజరవ్వాలంటూ చంద్రబాబు నుండి ఒత్తిళ్ళు వచ్చినా అధికారులు దూరంగా ఉంటున్నారు.

 

తన అధికారాల్లో ఈసి జోక్యం పెరిగిపోయిందని ఒకవైపు తనకిష్టం లేని ఎల్వీ సుబ్రమణ్యం అన్నీ శాఖల వ్యవహారాల్లో లోతుగా సమీక్షలు చేస్తుండటం మరోవైపు చంద్రబాబులో అసహనానికి కారణమైంది. నిబంధనలకు విరుద్ధమంటూ చంద్రబాబు ఆదేశాలతో జారీ అయిన 18 జీవోలను ఎల్వీ  నిలిపేశారు.  ఎలక్షన్ కమీషన్ మద్దతుతోనే ఎల్వీ ఇదంతా చేస్తున్నారంటూ మండిపోయిన చంద్రబాబు తాజాగా ద్వివేదిపై ఫిర్యాదు చేశారు.

 

అయితే ఇక్కడ చంద్రబాబు ఒక విషయం మరచిపోయారు. సీఈసి ఆదేశాలతోనే ద్వివేది కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ద్వివేదికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం ఏమీ ఉండదు. అదే సందర్భంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ వ్యవహారాలపైన కాకుండా తన దృష్టిని పార్టీ కార్యక్రమాలపై నిలిపితే హుందాగా ఉంటుంది. అంతేకానీ 14 సంవత్సరాలు  సిఎంగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తన స్ధాయిని తానే దిగజార్చుకునే విధంగా వ్యవహిరించటం బాగలేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: