ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఆ పార్టీ నేతల్లో ఎక్కడాలేని ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు  జగన్ వెంట నడిచిన పలువురు సీనియర్ నేతల నుంచి... పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారందరూ వైసీపీ గెలిచిన వెంటనే చాలా పదవులపై ఆశలు పెట్టుకుని కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ వెయిటింగ్ చేస్తున్నారు. ఫలితాలు ఇంకా రాలేదు... అప్పుడే ఎవరికి వారు తమకు కేబినెట్‌లో మంత్రి పదవి వస్తుంద‌ని ఊహల్లో మునిగి తేలుతున్నారు. కొందరు మాత్రం సామాజిక, ప్రాంతీయ,  జిల్లాల వారీగా సమీకరణలను బేరీజు వేసుకుని పదవుల ఊహల్లో విహరిస్తున్నారు. వైసీపీనే కాదు ఎక్కడ ? ఏ పార్టీ గెలిచిన  ఆ పార్టీకి చెందిన నేతల మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి ? ఏ పదవులు అన్న విషయంలో ఇప్పటివరకు చెప్పని జగన్మోహన్ రెడ్డి  ముగ్గురికి మాత్రం మంత్రి పదవులు ఇస్తున్నట్టు ఓపెన్‌గానే ప్రకటన చేశారు.  


మాజీ మంత్రి,   ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి,  చిలకలూరిపేటలో బిసి మ‌హిళ‌ విడ‌దల రజనీ కోసం సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్,  మంగళగిరిలో లోకేష్‌పై పోటీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి తన కేబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తానని జగన్ ప్రకటించారు. ఇక ఏపీలో పదవులు అన్నింటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది టీటీడీ చైర్మన్ పదవి.  ప్రపంచ వ్యాప్తంగానే అత్యంత ధ‌నిక‌ దేవాలయాల్లో ఒకటిగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ట నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌గా పని చేయాలని చాలా మంది రాజకీయ నాయకులు
తాపత్రయపడుతుంటారు.  టిడిపి సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అయితే ఈ పదవి చేపట్టడం తన జీవిత ధ్యేయం అని కూడా ప్రకటించారు. ఇక జగన్ అధికారంలోకి వస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి ఆ పార్టీ నుంచి ఎవరికి ? దక్కుతుంది అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చినట్టు వైసీపీలో చ‌ర్చ నడుస్తోంది. వైసీపీలో ఇంటర్నల్ టాక్ ప్రకారం ఆ పార్టీ సీనియర్ నేత,  రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీటీడీ చైర్మన్ అవుతారని, ఈ విషయమై జగన్ ఇటీవల ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 


జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవి వదులుకొని ఉప ఎన్నికల్లో గెలిచిన అమర్నాథ్‌రెడ్డి  దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మేడా మల్లికార్జున్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మేడా టిడిపి నుంచి వైసీపీలోకి జంప్ చేసి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయన కోసం అమర్నాథ్ రెడ్డి తన సీటు సైతం త్యాగం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. మేడాకు ఎమ్మెల్యే సీటు ఇచ్చినప్పుడు అమర్నాథ్ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని స్పష్టంగా హామీ ఇచ్చారు. అమర్నాథ్‌రెడ్డి మాత్రం తనకు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టాలని ఉందని జగన్‌కు చెప్పడంతో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిన్ను టిటిడి చైర్మన్ చేస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్టు వైసీపీలోని కీలక వ్యక్తుల నుంచి ఈ విష‌యం ఇప్పుడు ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చేసింది. ఇక ఎన్నికల ప్రచారంలో కోస్తా జిల్లాలకు చెందిన ఓ సీనియర్ నేత పార్టీ పార్టీకి ఫండింగ్‌ చాలా ఇస్తాను టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడిగారట. అందుకు జగన్ బదులిస్తూ మీరు ఆ విషయం మర్చిపోండి... టిటిడి చైర్మన్ పదవి అమర్నాథ్ రెడ్డి అన్నకు ఇస్తానని మాట ఇచ్చేసా అని జగన్ క్లారిటీ ఇవ్వడంతో జగన్ సీఎం అయిన వెంటనే అమర్నాథ్‌ రెడ్డి టిటిడి చైర్మన్ అవటం ఖాయమని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: