ఈసీ చెబితే వినాలి! ఇది ఒకప్ప‌టి మాట‌. ముఖ్యంగా కేర‌ళ‌కు చెందిన టీఎన్ శేష‌న్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ గా ఉన్న స‌మ‌యంలో రాజ‌కీయ నేత‌ల‌ను ఆయ‌న కంటి సైగ‌తో శాసించిన చ‌రిత్ర సొంతం చేసుకున్నారు. ఆయ‌న నోటి నుంచి ఏ వ్యాఖ్య వ‌స్తే.. దానిని తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల్సిందే. ఆయ‌న‌ను వివ‌ర‌ణ కోరే ద‌మ్ము కానీ, ఆయ‌న‌కు లేఖలు రాసిన సాహ‌సం కానీ.. ఉత్త‌రాదిలో కంచుకంఠాలుగా పేరు తెచ్చుకున్న ములాయంసింగ్ యాద‌వ్‌కానీ, మాయ‌వ‌తి కికానీ, లాలూప్ర‌సాద్ యాద‌వ్ వంటి వారికి కానీ ఉండేది కాదు. అనేకానేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకురావ‌డ‌మే కాకుండా.. దేశ ఎన్నిక‌ల ముఖ చిత్రాన్ని స‌మూలంగా మార్చిన ఘ‌న‌త‌, రాజ‌కీయ నేత‌లు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించేలా చేసిన ఘ‌న‌త‌ను కూడా శేష‌న్ సొంతం చేసుకున్నారు. 


అయితే, రాను రాను ఇలాంటి నాయ‌కులు త‌గ్గిపోయారు. ``పోనీలే పాపం`` అనుకునే క‌మిష‌న‌ర్లు, త‌మ ఉద్యోగాలు ఎక్క‌డ ఎఫెక్ట్ అవుతాయ‌నుకునే అధికారులు ఎన్నిక‌ల సంఘంలో క‌నిపిస్తున్నారు. దీంతో నాయ‌కులు ఇప్పుడు ఈసీని ఆడిం చేందుకు చూస్తున్నారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 324 ప్ర‌కారం ఏర్పాటైన ఎన్నిక‌ల సంఘానికి అనేక అధికారాలు ఉన్నాయి. ఈసీ కొర‌డా ఝ‌ళిపిస్తే.. అడ్డుకునే వ్య‌వ‌స్థ కూడా లేదు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి వారు మాత్రం తోక ఝాడిస్తూనే ఉన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌పై త‌న‌దే పైచేయి కావాల‌ని చూస్తున్నారు. గ‌తంలో సీబీఐపై యుద్ధం చేస్తానంటూ.. రోడ్డెక్కిన బెంగాల్ సీఎం మ‌మ‌త‌ను చూసి నేర్చుకున్నారో ఏమో.. ఇప్పుడు ఎన్నిక‌ల సంఘంపై యుద్ధం అంటూ.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. 


తాజాగా.. ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో సీఎంగా చంద్ర‌బాబుకానీ, ఆయ‌న మంత్రి వ‌ర్గానికి కానీ అధికారాలు చాలా నామ మా త్రంగానే ఉన్నాయ‌నేది నిష్టుర స‌త్యం. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 25 రోజుల స‌మ‌యం ఉం ది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఈ సీ అధికారులు తెలిసిన ప్పటికీ.. కూడా చంద్ర‌బాబు మాత్రం ``నేను మోనార్క్‌ని`` అని అంటున్నారు. అధికారుల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నారు. స‌చివాలంలో య థేచ్ఛ‌గా తిరుగుతున్నారు. ``ఇదేంటి సార్‌?`` అని ప్ర‌శ్నిస్తున్న ఎన్నిక‌ల అధికారుల‌పై త‌న అనుంగు మీడియాలో వ్య‌తిరేక వార్త‌లు రాయిస్తున్నారు. ఇక‌, ప్ర‌బుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని నిందితుడిగా పేర్కొన్నారు. 


నిజానికి రాష్ట్రంలో కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌న ప‌రిధులు తెలుసుకుని ముందుకు సాగాలి. కానీ, ఆయ‌న ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేమంటే.. సుప్రీం కోర్టుకు వెళ్తామ‌ని, మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తార‌ని కూడా బెదిరింపుల‌కు దిగుతున్నారు.ఈ  క్ర‌మంలోనే చంద్ర‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. తాను స‌మీక్ష‌లు చేస్తే.. త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఎండ‌ధాటి, నీటి ఎద్ద‌డి, రైతుల స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఏదేమైనా.. బాబు త‌న పంథాలో ముందుకు సాగ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: