అఖిలాండ కోటి బ్రన్మాండ నాయకుడు అయిన శ్రీవారి పవిత్ర ఆలయం తిరుమల ఇపుడు ఆధ్యాత్మికతకు బదులుగా అవినీతి కధలతో ప్రాచుర్యం పొందడం విషాదం. అనేక విషయాల్లో ఈ  కధలు వెలుగు చూస్తున్నాయి. దిద్దుబాటు చర్యలు  ఉండకపోగా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు.దీనికి కారణం ఏంటి.


మొన్న తిరుమలలో పింక్ డైమండ్ మాయమైందని సాక్ష్తాత్తు ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. దాని విదేశాల్లో భారీ ఎత్తున మొత్తానికి అమ్ముకున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. మరి అంతటి ఆరోపణలు వచ్చినా తగిన విచారణ లేదు. అందుకే మరిన్ని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇపుడు బంగారం తరలింపు టీటీడీ మెడకు చుట్టుకుంది.


ఓ బ్యాంక్ నుంచి అర్ధరాత్రి ఓ డొక్కు వ్యానులో నాలుగు వందల కోట్ల విలువ చేసే బంగారాన్ని గుట్టు చప్పుడు కాకండా తరలిస్తున్నారు. అయితే చెన్నై చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు పట్టుకోవడంతో అది బయటపడింది. మొత్తానికి ఆ బంగారం టీటీడీ గూటికి చేరింది. లేకపోతే ఆ బంగారం, వ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయేవోనన్న అనుమానాలు ఇప్పటికీ  ఉన్నాయి.


ఇక 2017 డిసెంబర్ 8 నుంచి 12 వరకూ మహా సంప్రోక్షణం పేరిట చేసిన కార్యక్రమాలు కూడా గుప్త నిధుల తవ్వకాల కోసమేనని ఆరోపణలు ఉన్నాయి. రాజుల కాలంలో వచ్చిన విలువైన బంగారం నగలు దాచి ఉంచిన నేలమాలిగను తవ్వారని కూడా విమర్శలు వచ్చాయి. ఇక రాజులు సమర్పించిన ఎన్నో విలువైన ఆభరణాలు కనిపించకపోవడాన్ని కూడా అనుమానించాల్సిందేనని అంటున్నారు. మూడు నెలల క్రితం గోవింద రాజుల స్వామి వారి కిరీటాలు కూడా దొంగిలించబడితే ఇప్పటికి సరైన విచారణ లేకపోవడం కూడా టీటీడీ డొల్లతనాన్ని బయటపెడుతోంది. మొత్తానికి చూసుకుంతే టీటీడీ తరచూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: