మొన్నటి వరకు ఎన్నికల గోలతో సతమతమయిన చంద్రబాబు కి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయా..అంటే అవుననే అంటున్నారు.  చంద్రబాబు అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని.. అందుకే తాము ఆయనపై పోరాడుతున్నామన్నారు. తన లాయర్‌ను సంప్రదించి ఈ కేసుపై నిర్ణయం తీసుకుంటామంటు న్నారు.  చంద్రబాబునాయుడిపై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అప్పట్లో హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 

 దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న పిటిషన్లపై ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో చంద్రబాబు తెచ్చుకున్న స్టే కూడా రద్దయ్యిందట. స్టే రద్దు కావడంతో.. హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కేసు విచారణను మళ్లీ మొదలుపెట్టగా.. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ చేశారు.  దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, ఈ స్టే రద్దుకాగా, కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని లక్ష్మీ పార్వతికి సమన్లు అందాయి.

ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. చంద్రబాబుపై దాఖలు చేసిన కేసును.. కొనసాగిస్తారా? ఉపసంహరిస్తారా? అంటూ ఏసీబీ కోర్టు లక్ష్మీపార్వతిని కోరారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ మే 13కు వాయిదా పడింది. ఈ కేసును లక్ష్మీపార్వతి కొనసాగించే అవకాశాలు మెండుగా ఉండటంతో.. విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కాగా, ఎన్నికల అఫిడవిట్లలో చంద్రబాబు భిన్నమైన ఆస్తులు చూపించారని.. బాబు తల్లికి హైదరాబాద్‌లో ఐదు ఎకరాల భూమి ఎలా సంపాదించిందని ప్రశ్నించామని లక్ష్మీ పార్వతి చెప్పారు.

  ఈ నేపథ్యంలో చంద్రబాబు అడ్డగోలుగా డబ్బు సంపాదించారని..ఆయన ఆస్తుల వివరాలపై కోర్టు జోక్యం చేసుకోవాలని అయన ఎంతో అవినీతి పరుడు అని..అందుకే తాము ఆయనపై పోరాడుతున్నామన్నారు. తన లాయర్‌ను సంప్రదించి ఈ కేసుపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: